BANKS RAISING INTEREST RATES ON LOANS KNOW HOW TO GET LOANS AT CHEAPER RATES WITH GOOD CIBIL SCORE SS
Bank Loan: వడ్డీ పెంచిన బ్యాంకులు... అయినా తక్కువ వడ్డీకే రుణాలు పొందండి ఇలా
Bank Loan: వడ్డీ పెంచిన బ్యాంకులు... అయినా తక్కువ వడ్డీకే రుణాలు పొందండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Bank Loan | బ్యాంకులన్నీ రుణాల వడ్డీ రేట్లు (Interest Rates) పెంచుతున్నాయి. దీంతో లోన్ తీసుకునేవారు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయినా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు.
బ్యాంకుల నుంచి లోన్లు (Bank Loans) తీసుకోవాలనుకునేవారికి వరుసగా షాకులు తగుల్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెండు నెలల్లో రెండుసార్లు రెపో రేట్ (Repo Rate) పెంచింది. ఒకసారి 40 బేసిస్ పాయింట్స్, మరోసారి 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ పెంచింది. దీంతో 90 పైసల వడ్డీ పెరిగింది. బ్యాంకులు కూడా ఆమేరకు రుణాల వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దీంతో కొత్తగా లోన్లు తీసుకోవాలనుకునేవారు ఎక్కువ వడ్డీ చెల్లించకతప్పని పరిస్థితి. అయినా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీ కే రుణాలు పొందొచ్చు. ఇందుకోసం సిబిల్ స్కోర్ (CIBIL Score) బాగుంటే చాలు. సిబిల్ స్కోర్ బాగున్నవారికి, మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుంటాయి.
సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారికి బ్యాంకులు ప్రీ-అప్రూవ్డ్ రుణాలు ఇస్తుంటాయి. వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువగా ఉన్నవారికి 79 శాతం రుణాలు మంజూరవుతాయని లెక్కలు చెబుతున్నాయి. లోన్లు తీసుకోవడానికి సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో చెప్పడానికి ఈ లెక్కలు చాలు. అందుకే సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. సిబిల్ స్కోర్ బాగుంటే రుణాలు వేగంగా మంజూరు కావడం మాత్రమే కాదు, వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి హోమ్ లోన్ కేవలం 7.40 శాతం నుంచే లభిస్తాయని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 పాయింట్స్ ఉంటుంది. 750 పాయింట్స్ కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండటాన్ని మంచి స్కోర్‌గా పరిగణిస్తారు. 750 పాయింట్స్ కన్నా ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే లోన్ అప్రూవల్ ప్రాసెస్ కూడా సులువుగా జరిగిపోతుంది. ట్రాన్స్‌యూనియన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఏడాదికి ఓసారి ఉచితంగా మీ సిబిల్ స్కోర్ చెక్ చేయొచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు ఉచితంగా సిబిల్ రిపోర్ట్ ఇస్తాయి.
సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలన్నా, మెరుగుపర్చుకోవాలన్నా ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మీరు గతంలో తీసుకున్న రుణాలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ బిల్లుల విషయంలోనూ గడువులోగా ఈఎంఐలు చెల్లించడం అవసరం. ఎట్టిపరిస్థితుల్లో మినిమమ్ అమౌంట్ చెల్లించకూడదు. ఒకే తరహా రుణాలు కాకుండా వేర్వేరు రుణాలు తీసుకొని ఈఎంఐలు గడువులోగా చెల్లిస్తూ ఉంటే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అంటే వెహికిల్ లోన్, హోమ్ లోన్, క్రెడిట్ కార్డ్... ఇలా వేర్వేరు క్రెడిట్ ఉండాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.