కరోనా వైరస్ సంక్షోభం అనేక మార్పుల్ని తీసుకొస్తోంది. లావాదేవీలు జరిపే పద్ధతుల్ని మార్చేస్తోంది. కస్టమర్లు, బ్యాంకులు ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్నాయి. లోన్లకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి రుణాలు మంజూరు చేసేవరకు అన్నీ ఆన్లైన్లో జరిగిపోతున్నాయి. ఇంతకుముందులాగా బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన అవసరం లేదు. ఆధార్ కేవైసీ విధానం కూడా మారిపోతుంది. కస్టమర్లకు సులువుగా లోన్లు ఇచ్చేందుకు నో యువర్ కస్టమర్-KYC ప్రాసెస్‌ను మరింత సులభతరంగా మార్చేస్తున్నాయి బ్యాంకులు. కస్టమర్లు ఇంట్లో నుంచే రుణాలకు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశించింది. దీంతో ఆధార్ బేస్డ్ కేవైసీలో మార్పులు వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్స్, లోన్స్ ఇచ్చేందుకు కస్టమర్ల ఆధార్ వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఉంది. ఓటీపీ ద్వారా ఆధార్ ఇ-కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది.
లోన్లు, క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లు ప్రాసెస్ చేసేందుకు వీడియో కేవైసీ ఉపయోగించేందుకు బ్యాంకులకు ఇటీవల అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ కెమెరా ద్వారా కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. బ్యాంకు నియమించిన అధికారి కస్టమర్లకు కాల్ చేసి కేవైసీ ప్రాసెస్ చేస్తారు. ఈ సరికొత్త టెక్నాలజీ కేవైసీ ప్రాసెస్‌ను మరింత వేగవంతం చేసే అవకాశముంది. ఆధార్ ఇ-కేవైసీ ద్వారా మీరు రూ.60,000 వరకు లోన్ తీసుకునే అవకాశముంది. క్రెడిట్ కార్డులు కూడా సులువుగా తీసుకోవచ్చు. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్-NBFC, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్-PPI లాంటి వాటికీ వీడియో కేవైసీ అవకాశం ఇవ్వాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Home Loan: హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గాయి... ఏ బ్యాంకులో ఎంతంటే
Credit Card: క్రెడిట్ కార్డు ఉన్నవారికి షాక్... లిమిట్ తగ్గించేస్తున్న బ్యాంకులు
Paytm: పేటీఎంతో మీరూ డబ్బులు సంపాదించొచ్చు... ఎలాగంటే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar, Aadhaar card, AADHAR, Bank, Bank loans, Banking, Home loan, Housing Loans, Personal Loan