హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan Offers: పండగ సీజన్‌లో గృహ రుణాలపై భారీ ఆఫర్లు.. అస్సలు మిస్ చేసుకోవద్దు

Home Loan Offers: పండగ సీజన్‌లో గృహ రుణాలపై భారీ ఆఫర్లు.. అస్సలు మిస్ చేసుకోవద్దు

రెసిడెన్షియల్ ప్లాట్ (మున్సిపాలిటీ) 109 చదరపు గజాల లోపు ఉండొచ్చు. అదే నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లోపు ఉండొచ్చు. అలాంటి అగ్రవర్ణ పేద ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

రెసిడెన్షియల్ ప్లాట్ (మున్సిపాలిటీ) 109 చదరపు గజాల లోపు ఉండొచ్చు. అదే నాన్ మున్సిపాలిటీ ప్రాంతాల్లో 209 చదరపు గజాల్లోపు ఉండొచ్చు. అలాంటి అగ్రవర్ణ పేద ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.

Home Loan Offers: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.

పండుగ సీజన్ వేగంగా సమీపిస్తుండటంతో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్లు తమ కస్టమర్లకు హోం లోన్స్, వెహికిల్ లోన్స్, పర్సనల్ లోన్లపై ఆఫర్లను ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపో రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆకర్షనీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులే కాదు పలు హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సి)లు కూడా పోటాపోటీగా గృహ రుణంపై వడ్డీ రేటు తగ్గిస్తున్నాయి.

2020 సెప్టెంబర్ 24 నాటికి బ్యాంక్ బజార్ నుంచి సేకరించిన డేటా ప్రకారం 20 సంవత్సరాల కాలానికి గాను 75 లక్షల హోమ్ లోన్లపై బ్యాంక్ / హెచ్ఎఫ్సిలు అమలుచేసే వడ్డీరేట్లు, నెలవారీ ఈఎంఐల పట్టికను పరిశీలిద్దాం.

తక్కువ వడ్డీకే హోమ్లోన్లు అందించే బ్యాంకులు, వాటి వడ్డీరేట్లు

బ్యాంకువడ్డీ రేటు(శాతం)ఈఎంఐ
బ్యాంక్ ఆఫ్ ఇండియా6.85రూ.57,474
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా6.85రూ.57,474
సెంట్రల్ బ్యాంక్6.90రూ.57,698
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్6.90రూ.57,698
యూనియన్ బ్యాంక్6.95రూ.57,923
బ్యాంక్ ఆఫ్ బరోడా7.00రూ.58,147
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర7.05రూ.58,373
కోటక్ బ్యాంక్7.10రూ.58,598
ఐఓబీ7.15రూ.58,825హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో..

సంస్థవడ్డీ రేటు(శాతం)ఈఎంఐ
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్7.00రూ.58,147
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్7.00రూ.58,147
బజాజ్ ఫైనాన్స్7.50రూ.60,419
కాన్ ఫిన్ హోమ్స్7.95రూ.62,500
ఏఏవీఏఎస్ ఫైనాన్షియర్8.00రూ.62,733
రెప్కో హోమ్8.25రూ.63,905
టాటా క్యాపిటల్8.50రూ.65,087
పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్8.60రూ.65,562
దేవన్ హౌజింగ్8.75రూ.66,278
ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్8.99రూ.67,431


బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 సంవత్సరాల కాలానికి గాను రూ .75 లక్షల హోం లోన్‌కు 6.85 శాతం వడ్డీ రేటును అమలుచేస్తున్నాయి. దీనికి గాను నెలావారీగా ఈఎంఐ రూ.57,474 చెల్లించాల్సి ఉంటుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ మినహా, తక్కువ వడ్డీకే హోంలోన్ అందించే టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నవన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులే. అయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఈ లిస్టులో లేదు. ఎస్‌బీఐ గృహ రుణాలపై 7.20 శాతం వడ్డీరేటును అమలు చేస్తుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బిఎఫ్సి) సాధారణంగా బ్యాంకుల కంటే చాలా ఎక్కువ రేట్లు వసూలు చేస్తాయి. అయితే తక్కువ వడ్డీకే హోంలోన్స్ ఇచ్చే వాటిలో హెచ్డిఎఫ్సి లిమిటెడ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఈ రెండు హెచ్ఎఫ్‌సీలు 7 శాతం వడ్డీకే లోన్లు అందిస్తున్నాయి. పైన పేర్కొన్న డేటా మొత్తాన్ని బ్యాంక్ బజార్ నుంచి తీసుకోబడింది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Bank loans, Home loan

ఉత్తమ కథలు