హోమ్ /వార్తలు /బిజినెస్ /

Home Loan: భారీగా పడిపోయిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు... సొంతిల్లు కొనడానికి ఇదే సరైన సమయమా?

Home Loan: భారీగా పడిపోయిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు... సొంతిల్లు కొనడానికి ఇదే సరైన సమయమా?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Home Loan | మీరు హోమ్ లోన్ తీసుకొని సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లు, ఆఫర్లు చూస్తుంటే ఇదే సరైన సమయం.

  హోమ్ లోన్ వడ్డీ రేట్లు భారీగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి వడ్డీ రేట్లు చేరాయి. ఒకప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేట్లు అంటే 9 శాతం పైనే ఉండేవి. కొన్ని బ్యాంకుల్లో అయితే వడ్డీ రేట్లు 10 శాతం దాటేవి. కానీ ఇప్పుడు వడ్డీ రేట్లు ఊహించని స్థాయిలో పడిపోయాయి. ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వరంగ బ్యాంకులు పోటాపోటీగా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీలోనే అతి తక్కువగా 6.7 శాతం వడ్డీకే ఇంటి రుణాలు ఇస్తున్నాయి. మంచి సిబిల్ స్కోర్ ఉన్న మహిళా ఉద్యోగులకు ఇంత తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ వస్తుండటం విశేషం. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ వడ్డీ 6.85 శాతం దగ్గర ప్రారంభమవుతున్నాయి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు 6.90 శాతం వడ్డీకి హోమ్ లోన్స్ ఇస్తున్నాయి.

  Royal Enfield Meteor 350: అదిరిపోయే ఫీచర్స్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో బైక్... ప్రత్యేకతలు ఇవే

  Flipkart Big Diwali Sale: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.30,000 డిస్కౌంట్... ఫైనల్ రేట్ ఎంతంటే

  హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఏకంగా 7 శాతం లోపు దిగిరావడం విశేషమే. వడ్డీ రేట్లు ఇంతలా తగ్గుతాయని ఎవరూ ఊహిచలేరు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్ భారీగా తగ్గించడంతో హోమ్ లోన్ వడ్డీ రేట్లు కూడా దిగొస్తున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లను రేపో రేట్‌కు లింక్ చేయడంతో రెపో రేట్ తగ్గినప్పుడల్లా ఇంటి రుణాలపై వడ్డీ తగ్గుతోంది. ప్రస్తుతం రెపో రేట్ 4 శాతంగా ఉంది. రెపో రేట్ కూడా ఈ స్థాయిలో దిగిరావడం ఇదే మొదటిసారి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించడం మాత్రమే కాదు ఈ ఫెస్టివల్ సీజన్‌లో అనేక ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి బ్యాంకులు.

  Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఈ పుకార్లు నమ్మొద్దు

  SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు బంపరాఫర్... వడ్డీ తగ్గించుకోండి ఇలా

  ఉదాహరణకు ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేస్తే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అంతేకాదు... క్రెడిట్ స్కోర్‌పై 10 బేసిస్ పాయింట్స్, యోనో యాప్ ద్వారా అప్లై చేసినందుకు 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు తగ్గుతుంది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ మాన్‌సూన్ బొనాంజా స్కీమ్‌లో భాగంగా 6.90 శాతం వడ్డీకే హోమ్ లోన్ ఇస్తోంది. ఏకంగా ప్రాపర్టీ వ్యాల్యూలో 90 శాతం లోన్ ఇస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు తగ్గించింది. ఫోర్‌క్లోజర్‌కు ఎలాంటి ప్రీ-పేమెంట్ ఛార్జీలు లేవని ప్రకటించింది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంకు కేవలం రూ.3,000+జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజుతో హోమ్ లోన్స్ ఇస్తోంది. ఒరిజినల్ లోన్ అమౌంట్‌కు 100 శాతం టాప్ అప్ ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాసెసింగ్ ఫీజు తొలగించింది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank, Bank loans, Bank of Baroda, Bank of India, Banking, Canara Bank, HDFC bank, Home loan, Housing Loans, Sbi, State bank of india

  ఉత్తమ కథలు