Car Loans: కొత్త కారు కొంటున్నారా ?.. ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్...త్వరపడండి...

Car Loans: కొత్త కారు కొంటున్నారా ?.. ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్...త్వరపడండి...

ప్రతీకాత్మకచిత్రం

కొత్త కారు కొనుగోలుకు ముందు కేవలం వడ్డీ రేటునే కాకుండా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వాటిపై ఓలుక్కేద్దాం.

  • Share this:
    ఒకప్పుడు కారు ఉండటాన్ని లగ్జరీగా పరిగణించేవారు. కానీ, ఇప్పుడు ఒక అవసరంగా మారింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, అందుబాటు ధరలోనే కార్లు లభిస్తుండటంతో మధ్య తరగతి వర్గాలు కూడా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. వివిధ బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తుండటం కూడా వీరికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే, ఆయా బ్యాంకులు వడ్డీని నిర్ణయించే క్రమంలో మీ నెలవారీ జీతం, వృత్తి, ప్రస్తుత EMI, క్రెడిట్ స్కోరు వంటి విషయాలను ప్రామాణికంగా తీసుకుంటాయి. ఈ వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి కూడా మారుతుంటాయి. వాటిలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి కార్​లోన్​ అందజేస్తుందో పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొత్త కారు కొనుగోలుకు ముందు కేవలం వడ్డీ రేటునే కాకుండా అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వాటిపై ఓలుక్కేద్దాం.


    కారు లోన్​కు ముందు పరిశీలించాల్సిన అంశాలు..

    1. మీ కారు ఎక్స్​షోరూమ్​ ధరలో 20% డౌన్​ పేమెంట్ పెట్టి కొనుగోలు చేయడం ఎల్లప్పుడూ స్మార్ట్ ఆలోచన. అయితే, చాలా బ్యాంకులు కారు ఎక్స్-షోరూమ్ విలువలో 100% వరకు రుణాలు అందిస్తాయి. అయినా సరే, 20% డౌన్​పేమెంట్ కట్టి లోన్​ తీసుకోవడం మంచిది. తద్వారా మీ నెలవారీ EMI చెల్లింపు విలువ తగ్గుతుంది.

    2. కారు కొనుగోలు చేసిన వారు చాలా కాలం పాటు EMI చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. వాటి చెల్లింపులకు ముందుగానే ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. అయితే, నెలవారీ భారం కాస్త ఎక్కువైనా సరే తక్కువ కాల పరిమితినే ఎంచుకోవడం ఉత్తమం. దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం ద్వారా వడ్డీ భారం ఎక్కువ అవుతుందని గుర్తించుకోవాలి.

    3. కారు లోన్​ తీసుకునే వారు వడ్డీతో పాటు అదనంగా అనేక ఛార్జీలు, ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల, దరఖాస్తు చేసేటప్పుడు ఛార్జీలు, ఫీజుల గురించి తప్పకుండా తెలుసుకోండి. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజు, క్రెడిట్ రిపోర్ట్ ఫీజు, రిజిస్ట్రేషన్ కార్డ్ వసూలు ఫీజు, స్టాంప్ డ్యూటీ, జప్తు రుసుము, లేట్​ పేయిమెంట్​ ఫీజు, రుణ రద్దు ఫీజు, స్వాప్, చెక్​ బౌన్స్ ఫీజులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఏ బ్యాంకులో వడ్డీ తీసుకోవాలనేది నిర్ణయించుకోవాలి.


    కారు లోన్​ దరఖాస్తుకు అర్హత..

    కారు లోన్​ ఇవ్వడానికి బ్యాంకులు వేర్వేరు నిబంధనలను అనుసరిస్తాయి. సాధారణంగా అన్ని బ్యాంకులు వారి క్రెడిట్​ స్కోర్​తో పాటు వృత్తి, నెలవారీ ఆదాయాన్ని పరిశీలించి వడ్డీ నిర్ణయిస్తాయి. కారు లోన్​కు అర్హత, డాక్యుమెంట్స్​ను పరిశీలిద్దాం.


    1. దరఖాస్తుదారుడు 18 నుండి 75 సంవత్సరాల వయస్సులో ఉండాలి.

    2. వారి కనీస నెలవారీ ఆదాయం రూ. 20,000 ఉండాలి.

    3. ప్రస్తుత యాజమాన్యంలో కనీసం ఏడాది నుంచి పనిచేస్తూ ఉండాలి.

    4. తప్పనిసరిగా జీతం లేదా స్వయం ఉపాధి గల వ్యక్తి అయి ఉండాలి.


    కావాల్సిన డాక్యుమెంట్స్​..

    కారు లోన్​ కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్​ సమర్పించాల్సి ఉంటుంది.

    ఐడెంటిటీ ప్రూఫ్​: పాన్, పాస్‌పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడి కార్డ్

    రెసిడెన్సి ప్రూఫ్​: పాస్‌పోర్ట్. ఆధార్, యుటిలిటీ బిల్లులు, రేషన్ కార్డ్

    ఇన్​ కమ్​ ప్రూఫ్​: గత 3 నెలల శాలరీ స్లిప్స్, ఫారం 16, తాజా ఐటి రిటర్న్స్, గత 6 నెలలుగా బ్యాంక్ స్టేట్ మెంట్


    తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్న టాప్​ 10 బ్యాంకులు...

    భారతదేశంలోని అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీరేటుకే కారు​ లోన్లను అందిస్తున్నాయి. మిగతా అన్ని బ్యాంకులతో పోలిస్తే రూ.10 లక్షల కారు​లోన్​పై పంజాబ్ & సింథ్​ బ్యాంక్ 7.1 శాతం వడ్డీ రేటునే వసూలు చేస్తోంది.

    బ్యాంకు వడ్డీ రేటు (ఏడాదికి)

    పంజాబ్​ అండ్​ సింధ్​ బ్యాంక్​ 7.1%

    సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 7.25%

    కెనరా బ్యాంక్​ 7.3%

    పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ 7.3%

    బ్యాంక్​ ఆఫ్​ బరోడా 7.35%

    యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 7.4%

    బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 7.45%

    బ్యాంక్​ ఆఫ్ మహారాష్ట్ర 7.5%

    ఐడీబీఐ బ్యాంక్​ 7.5%

    ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​ 7.55%
    Published by:Krishna Adithya
    First published: