SBI vs HDFC vs ICICI Bank: భారీగా తగ్గిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు... ఏ బ్యాంకులో ఎంత అంటే

SBI vs HDFC vs ICICI Bank | మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? గతంతో పోలిస్తే ఇప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోండి.

news18-telugu
Updated: November 2, 2020, 2:42 PM IST
SBI vs HDFC vs ICICI Bank: భారీగా తగ్గిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు... ఏ బ్యాంకులో ఎంత అంటే
SBI vs HDFC vs ICICI Bank: భారీగా తగ్గిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు... ఏ బ్యాంకులో ఎంత అంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఇదే అత్యద్భుత ముహూర్తం. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీకి గృహ రుణాలు (home loans) లభిస్తున్నాయి. అంతేకాదు ఆకర్షణీయమైన అతి తక్కు వ వడ్డీ రేట్లు వసూలు చేస్తున్న పలు బ్యాంకులు బంపర్ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఇటీవలే హోమ్ లోన్లపై వడ్డీని సవరిస్తూ బాగా తగ్గించాయి. పండుగ సీజన్ కూడా కావడంతో ఇళ్ల కొనుగోళ్లకు సరైన సీజన్ కూడా కావడంతో బ్యాంకులు ఇలా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి హోమ్ లోన్లపై వడ్డీ ఒకటిన్నర దశాబ్దకాలంలో కనిష్టానికి పడిపోయింది. ఓవైపు స్థిరాస్థి ధరలు నేలచూపులు చూస్తుండగా మరోవైపు అదనపు డిస్కౌంట్లు ఇస్తున్న రియాల్టీ డెవలపర్స్ సొంతిల్లు కొనాలనుకునే వారికి గాలం వేస్తున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెట్స్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ విశ్లేషించారు.

తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవేమనదేశంలో అత్యధిక రుణాలు ఇచ్చే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా గృహ రుణాలపై వసూలు చేసే వడ్డీలను తగ్గిస్తూ భారీ రాయితీలు ప్రకటించింది. రూ.30,00,000/-వరకు తీసుకునే హోమ్ లోన్స్ పై 6.90శాతం వడ్డీ వసూలు చేస్తుండగా 30 లక్షలకంటే ఎక్కువ మొత్తంలో తీసుకునే హోమ్ లోన్స్ పై 7శాతం వడ్డీ వసూలు చేస్తోంది. 75 లక్షలకంటే ఎక్కువ మొత్తాలను స్టేట్ బ్యాంక్ లో గృహ రుణంగా తీసుకుంటే వారికి 25 బేసిస్ పాయింట్స్ కన్సెషన్ లభిస్తుంది. కానీ ఇవన్నీ మీ సిబిల్ స్కోర్ పై మాత్రమే ఆధారపడి ఉంటాయి.

ATM: ఏటీఎం యూజర్లకు అలర్ట్... ఇక ఈ ఛార్జీలు చెల్లించాల్సిందే

Indane Gas: ఇండేన్ గ్యాస్ సబ్సిడీ రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి

మహిళలకు స్పెషల్ గా..


ఫెస్టివ్ ఆఫర్ ను మరికొన్ని రోజులపాటు పొడగించిన ఎస్ బీఐ క్రెడిట్ స్కోర్ ఆధారంగా గతంలోలా 10 bps కన్సెషన్ కాకుండా ఏకంగా 20 bps వరకూ కన్సెషన్ ఇస్తోంది. ఈ ఆఫర్ 30 లక్షలనుంచి 2 కోట్ల రూపాయల హోమ్ లోన్స్ కు వర్తిస్తుందని ఎస్ బీఐ స్పష్టం చేసింది. ఇదే కన్సెషన్ ను 3 కోట్ల రూపాయల రుణాల వరకు వర్తించేలా 8 మహా నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. అదనంగా 5 bps కావాలనుకుంటే ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్ YONO ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక హోమ్ లోను తీసుకునే మహిళలకు ప్రత్యేకంగా మరో 5 bps ఇంట్రెస్ట్ కన్సెషన్ కూడా లభిస్తుంది.

కొటక్ మహీంద్రా


కొటక్ మహీంద్ర ప్రవేశపెట్టిన ఫెస్టివ్ లోన్స్ ఏడాదికి 6.9శాతం వడ్డీ రేట్లతో ప్రారంభమవుతుండడం విశేషం. ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకున్నవారు తమ రుణాన్ని కోటక్ మహీంద్ర బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేసుకుంటే ఏకంగా 20 లక్షల వరకు రాయితీలు పొందే సదుపాయన్ని కల్పిస్తోంది. మహిళలకు కోటక్ మహీంద్రా ఆకర్షణీయమైన స్వల్ప వడ్డీ రుణాలు అందుబాటులోకి తెచ్చింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా


హౌజింగ్ లోన్స్ పై బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త రాయితీలు ప్రకటిస్తూ ఏకంగా 15 బేసిస్ పాయింట్స్ ను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్లు 6.85శాతానికే అందుబాటులోకి వచ్చి కస్టమర్లను ఊరిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారిని ఆకట్టుకునేలా ఈ ఆఫర్ ఉంది.

IRCTC Kerala Tour: అదిరిపోయే ఆఫర్... ఐదు వేలకే కేరళ టూర్

Samsung galaxy m51: రూ.22,499 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.3099 ధరకే... కొనండి ఇలా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


ఇతర బ్యాంకుల్లానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హోమ్ లోన్ల రేసులో దూసుకుపోతోంది. 30 లక్షల వరకు తీసుకునే గృహ రుణాలపై 10 బేసిస్ పాయింట్స్ తగ్గించినట్టు యూబీఐ వెల్లడించింది. మహిళా కస్టమర్లకు ప్రత్యేకంగా, అదనంగా మరో 5 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. యూనియన్ బ్యాంకులో హోమ్ లోన్లు 7శాతంతో ప్రారంభమవుతాయి. అంతేకాదు ప్రాసెసింగ్ ఫీ కూడా లేకుండా డిసెంబర్ 31 వరకు యూనియన్ బ్యాంకులో చవక వడ్డీ రేట్లకే గృహ రుణాలు పొందవచ్చు.

యాక్సిస్ బ్యాంక్


బ్యాంకింగ్ రంగంలో చాలా ఆగ్రెస్సివ్ గా దూసుకుపోతున్న యాక్సిస్ బ్యాంక్ లో హోమ్ లోన్స్ ఏడాదికి 6.9శాతం వడ్డీ రేటుతో ప్రారంభమవుతాయి. హెడ్ డీఎఫ్ సీలో గృహ రుణాలు 6.9శాతం వడ్డీ రేట్లతోనే ప్రారంభమవుతున్నాయి. హెచ్ డీఎఫ్ సీలో తీసుకునే గృహ రుణాల్లోని మొత్తం నుంచి 0.5శాతాన్ని ప్రాసెసింగ్ ఫీగా వసూలు చేస్తారు. గరిష్ఠంగా 3వేల రూపాయలు మాత్రమే ఈ ఫీ ఉంటుంది కనుక కస్టమర్లకు ఇదేమంత భారమనిపించదు. ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ల విషయానికి వస్తే 6.95శాతం నుంచి 7.95శాతం మధ్య వడ్డీ రేట్లు ఉంటున్నాయి.
Published by: Santhosh Kumar S
First published: November 2, 2020, 2:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading