Bank Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు చూసి ఆశపడుతున్నారా.. అయితే ఇది మీకోసం..

దేశీయ బ్యాంకులు డిపాజిట్ల వేటలో పడ్డాయి. అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తూ బల్క్ డిపాజిట్లపై కన్నేశాయి. అయితే వడ్డీ రేట్లు చూసి తొందరపడి ఫిక్స్‌డ్ డిపాజిట్స్ చేస్తే చిక్కులు తప్పవు అంటున్నారు నిపుణులు.


Updated: March 21, 2019, 6:11 PM IST
Bank Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు చూసి ఆశపడుతున్నారా.. అయితే ఇది మీకోసం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్యాంకుల్లో నగదు కొరత వినియోగదారుల పాలిట వరంగా మారనుంది. బ్యాంకులు నిధుల వేటలో భాగంగా మరోసారి భారీగా డిపాజిట్ల సేకరణకు శ్రీకారం చుడుతున్నాయి. ఇందులో భాగంగా డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. గడిచిన సంవత్సర కాలంగా గమనిస్తే బ్యాంకుల క్రెడిట్ రేట్ 12.9 శాతం పెరిగితే అదే సమయంలో గత డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్ నాటికి డిపాజిట్ గ్రోత్ మాత్రం కేవలం 9.3 శాతం మాత్రమే పెరిగింది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం క్రెడిట్ గ్రోత్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్యాంకులు నిధుల కోసం డిపాజిట్లు సేకరించేందుకు మొగ్గు చూపుతాయని పేర్కొంది. అందుకే కస్టమర్లు బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లపై కన్నేయాల్సి ఉంది.

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చూసి తొందరపడొద్దు..

బ్యాంకులు సాధారణంగా డిపాజిట్లను బల్క్ గా సేకరించేందుకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. ప్రైవేటు బ్యాంకులు క్రెడిట్ గ్రోత్ 22 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల మధ్య విపరీతమైన పోటీకి దారితీసే అవకాశమున్నట్లు ఇండియా రేటింగ్స్ నివేదికలో పేర్కొంది.

డిపాజిటర్లు కేవలం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చూసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టి ఇరుక్కోవద్దు. ముఖ్యంగా నిబంధనలు పూర్తిగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే వడ్డీ రేట్ల వెనుక ఉన్న మతలబులను జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు.. మార్కెట్లోనే అత్యధికంగా డిపాజిట్లపై 9.25 శాతం వడ్డీ రేటు ఇస్తామని ముందుకు వచ్చిన జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, లాకిన్ పిరియడ్ మాత్రం మూడు సంవత్సరాలుగా నిర్దేశించింది. అంతే కాదు రూ.15 లక్షల లోపు డిపాజిట్లను 3 సంవత్సరాల లోపల ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్‌కు వీలులేకుండా నిబంధనలు రూపొందించింది. ఎంత ఎమర్జన్సీ ఉన్నా మూడేళ్ల వరకూ మీ డిపాజిట్‌ను విత్ డ్రా చేసుకునే అవకాశం లేదని అర్థం. ఇలాంటి నిబంధనల పట్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి.

Banks,High Interest Rate,Fixed deposit,deposits,KA,bank,SBI,Andhra Bank,ICICI bank,Axis Bank, వడ్డీ రేట్లు,ఫిక్స్ డ్ డిపాజిట్లు,పన్నులు,
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం పలు ప్రైవేటు బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి :




  • జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కాల వ్యవధి - 3 సంవత్సరాలు, వడ్డీ రేటు : 9.25 శాతం

  • ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కాల వ్యవధి - 2నుంచి3 సం||లు, వడ్డీ రేటు : 9.00 శాతం

  • ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కాల వ్యవధి - 2 సంవత్సరాలు, వడ్డీ రేటు : 8.25 శాతం

  • ఇండస్ ఇండ్ బ్యాంక్, కాలవ్యవధి - 1 సంవత్సరం, వడ్డీ రేటు : 8 శాతం

  • కర్నాటక బ్యాంక్, కాల వ్యవధి - 475 రోజులు, వడ్డీ రేటు : 7.75 శాతం


అలాగే బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయంపై పూర్తి స్థాయి పన్ను విధింపు ఉండటం కూడా బల్క్ డిపాజిట్లకు అవరోధంగా మారనుంది. అలాగే రూ.5 లక్షల లోపు ఆదాయం కలవారు సైతం డిపాజిట్లపై వచ్చే ఆదాయంతో సీలింగ్ దాటితే మాత్రం ఇన్‌కమ్‌టాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

అందుకే బ్యాంకు నిబంధనలకు పూర్తిగా చదివి, వివరాలు, సందేహాలు అన్ని తీరిన తర్వాతే మీ డబ్బును డిపాజిట్ చేయండి. అలాగే పెద్ద మొత్తంలో ఎఫ్‌డీ చేస్తే మాత్రం వడ్డీ ఆదాయాన్ని బేరీజు వేసుకొని ఎంత ట్యాక్స్ పడుతుందో చూసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో ట్యాక్స్ కన్సల్టెంట్స్ సలహా తీసుకుంటే మంచిది. మీ ఆదాయంలో ఎన్ని డిడక్షన్స్ చూపించినా డిపాజిట్లపై  అధిక వడ్డీరేటుకి ఆశపడితే మాత్రం పన్ను పోటు తప్పదు.
Published by: Krishna Adithya
First published: March 21, 2019, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading