Home /News /business /

BANKS OFFER LOAN ON SHARES WITH LOW INTEREST RATES AK GH

Loan on Shares: మీ దగ్గర ఉన్న షేర్లపై లోన్.. వడ్డీ చాలా తక్కువ.. ఎంతవరకు ఇస్తారంటే ?

Loan on Shares: మీ దగ్గర ఉన్న షేర్లపై లోన్.. వడ్డీ చాలా తక్కువ.. ఎంతవరకు  ఇస్తారంటే ?

Loan on Shares: మీ దగ్గర ఉన్న షేర్లపై లోన్.. వడ్డీ చాలా తక్కువ.. ఎంతవరకు ఇస్తారంటే ?

Loan Against Shares: మీ షేర్లను ష్యూరిటీగా చూపించి బ్యాంకు రుణం పొందవచ్చు. అయితే ఎంత వరకు రుణం పొందవచ్చేది మాత్రం బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది.

హోమ్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు ఇలా అనేక రకాల లోన్లు ఇస్తుంటాయి. కానీ మనం కొనుగోలు చేసే షేర్లపై కూడా రుణాలు ఇస్తారనే విషయం చాలామందికి తెలియదు. అత్యవసరంగా డబ్బు అవసరమైన సందర్భంలో షేర్ల ద్వారా లోన్ను తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలున్నాయి. వీటిని మార్టిగేజ్ లోన్‌గా పరిగణించొచ్చు. ఈ రుణాలు కూడా బంగారు రుణాల మాదిరిగానే పనిచేస్తాయి. అంటే మీరు సకాలంలో లోన్ చెల్లించకపోతే మీ వాటాలను విక్రయించడానికి మరియు డబ్బును తిరిగి పొందటానికి బ్యాంకుకు పూర్తి హక్కు ఉంటుందన్న మాట. కాబట్టి, మీరు తీసుకున్న లోన్ సకాలంలో చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

షేర్ల ద్వారా ఎంత రుణం పొందొచ్చు?
మీ షేర్లను ష్యూరిటీగా చూపించి బ్యాంకు రుణం పొందవచ్చు. అయితే ఎంత వరకు రుణం పొందవచ్చేది మాత్రం బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. దేశంలో అతిపెద్ద రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.50,000 నుంచి గరిష్టంగా రూ .20 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తుంది. అయితే మీ రుణ పరిమితి ఎంత అనేది మీ షేర్ వాల్యూని బట్టి బ్యాంకులు నిర్ణయిస్తాయి. ఎస్‌బీఐతో పాటు అనేక బ్యాంకులు రుణాల కోసం మీరు పెట్టే ష్యూరిటీకి 50 శాతం మార్జిన్ లోబడి మాత్రమే మంజూరు చేస్తాయని గుర్తుంచుకోవాలి.

అంటే ఒకవేళ మీరు 5 లక్షల రుణం తీసుకోవాలి అనుకుంటే దానికి ష్యూరిగా పెట్టే మీ షేర్ వాల్యూ ప్రస్తుత మార్కెట్లో10 లక్షల వరకు ఉండాలి. ప్రతి బ్యాంక్ దగ్గర అప్రూవుడ్ సెక్యూరిటీస్ల జాబితా ఉంటుంది. ఆ జాబితాలో మీ షేర్ ఉన్నట్లైతే దాన్ని ష్యూరిటీగా పెట్టి లోన్ పొందవచ్చు. బ్యాంకులు "A" గ్రూప్‌లో ఉన్న షేర్లను మాత్రమే తనఖా పెట్టడానికి అవకాశం ఇస్తాయి. కాబట్టి మీ వద్ద ఉన్న ప్రతి షేర్‌ను తనఖా పెట్టలేరని గుర్తించుకోవాలి.

Loan on shares, bank loan on shares, loan on equity shares, loan against shares, sbi loan on Shares, interest on loan on shares, షేర్లపై రుణాలు, షేర్లపై బ్యాంకు రుణాలు
(ప్రతీకాత్మక చిత్రం)


వడ్డీ రేటు ఎంతంటే..
ఎస్బీఐ ప్రస్తుతం షేర్లను ష్యూరిగా పెట్టి తీసుకునే రుణాలపై 9.75 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. అదే ఎస్బీఐలో వ్యక్తిగత రుణాలపై కనీస వడ్డీ రేటు 13 శాతంగా ఉంటుంది. కాబట్టి, ఇది వ్యక్తిగత రుణాల కంటే షేర్లను తనఖా పెట్టి తీసుకునే రుణాలే ఆకర్షణీయంగా ఉంటాయి. కాగా, ఎన్ఎస్సి/ కెవిపి, ఆర్బిఐ రిలీఫ్ బాండ్లను తనఖా పెట్టి తీసుకునే రుణంపై ఎస్బిఐ 11.90 శాతం వడ్డీని వసూలు చేస్తుంది.

ప్రాసెసింగ్ ఫీజు ఎంతంటే..
అన్ని రుణాల మాదిరిగానే, షేర్లపై తీసుకునే రుణాలపై కూడా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులతో పాటు జీఎస్టీ ఛార్జీలు వసూలు చేస్తాయి. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు తీసుకునే రుణం మొత్తంలో 0.75 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. కాబట్టి, మీరు షేర్లను తనఖా పెట్టి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుంటే, ప్రాసెసింగ్ ఛార్జీలుగా కనీసం రూ .7,500 చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు జీఎస్టీ ఛార్జీలు కూడా అదనంగా చెల్లించాలి.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Bank loans, Share price

తదుపరి వార్తలు