హోమ్ /వార్తలు /బిజినెస్ /

Recurring Deposit: నెల నెలా డబ్బులు దాచుకోవాలనుకునే వారికి శుభవార్త.. బ్యాంకుల బంపరాఫర్!

Recurring Deposit: నెల నెలా డబ్బులు దాచుకోవాలనుకునే వారికి శుభవార్త.. బ్యాంకుల బంపరాఫర్!

 నెల నెలా డబ్బులు దాచుకునే వారికి శుభవార్త.. 3 బ్యాంకుల బంపరాఫర్!

నెల నెలా డబ్బులు దాచుకునే వారికి శుభవార్త.. 3 బ్యాంకుల బంపరాఫర్!

Bank News | ప్రతి నెలా బ్యాంక్‌లో చిన్న మొత్తంలో డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కొన్ని బ్యాంకులు ఆర్‌డీ అకౌంట్లపై ఆకర్షణీయ వడ్డీ రేటును అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Deposits | బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా? ప్రతి నెలా చిన్న మొత్తంలో పొదుపు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. రికరింగ్ డిపాజిట్లపై (RD) ప్రస్తుతం బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీ రేటును (Interest Rates) అందిస్తున్నాయి. వీటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి పొందొచ్చు. రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి పొందాలని భావించే వారికి రికరింగ్ డిపాజిట్లు అనువుగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయలేని వారు ఈ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.

  చాలా బ్యాంకులు రికరింగ్ డిపాజిట్ సర్వీసులు అందిస్తున్నాయి. 6 నెలల నుంచి పదేళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన దగ్గరి నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ రేటులో మార్పు ఉండదు. ప్రారంభంలో ఏ వడ్డీ రేటు ఉందో అదే వడ్డీ రేటు చివరి వరకు కొనసాగుతుంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన వడ్డీ రేటు మారొచ్చు.

  శుభవార్త.. భారీగా తగ్గిన ఈ 11 నిత్యావసర వస్తువుల ధరలు!

  రికరింగ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ అందించే బ్యాంకులు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. బంధన బ్యాంక్ పలు రకాల టెన్యూర్లలో ఆర్‌డీ సర్వీసుల అందిస్తోంది. వడ్డీ రేటు 4.5 శాతం నుంచి 5.6 శాతం వరకు ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు 0.75 శాతం అధిక వడ్డీ వస్తుంది. యస్ బ్యాంక్ 6.75 శాతం దాకా వడ్డీని అందిస్తూ వస్తోంది. పదేళ్ల వరకు ఆర్‌డీ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు 75బేసిస్ పాయింట్ల వరకు ఎక్కువ వడ్డీ వస్తుంది.

  ఇప్పుడు కొనండి.. వచ్చే ఏడాది నుంచి ఈఎంఐ కట్టండి! కంపెనీ అదిరే ఆఫర్!

  ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఆకర్షణీయ వడ్డీని అందిస్తోంది. రూ.500 నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రిక్లోజింగ్, నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ బ్యాంక్ కూడా ఆర్‌డీలపై 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు అదనంగా 0.5 శాతం వడ్డీ లభిస్తుంది. పదేళ్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఇకపోతే చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ఇందుకు కారణం. అందువల్ల బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ ఉందో ముందే తెలుసుకోవడం ఉత్తమం. ఎక్కువ వడ్డ వచ్చే బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటే ఎక్కు రాబడి పొందొచ్చు. అందువల్ల ఇన్వెస్ట్ చేయడానికి ముందే ఎఫ్‌డీ రేట్లను ఒకసారి చెక్ చేసుకోండి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Banks, Deposits, Personal Finance, Recurring Deposits, Savings

  ఉత్తమ కథలు