Home /News /business /

BANKS MERGER NEWS 10 PUBLIC SECTOR BANKS MERGED AS 4 BANKS COMES INTO EFFECT FROM TODAY SS

Banks Merger: బ్యాంకుల విలీనం నేటి నుంచే అమలులోకి... మిగిలేవి ఈ బ్యాంకులే

Banks Merger: బ్యాంకుల విలీనం నేటి నుంచే అమలులోకి... మిగిలేవి ఈ బ్యాంకులే
(ప్రతీకాత్మక చిత్రం)

Banks Merger: బ్యాంకుల విలీనం నేటి నుంచే అమలులోకి... మిగిలేవి ఈ బ్యాంకులే (ప్రతీకాత్మక చిత్రం)

Banks Merger | ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తైంది. 10 బ్యాంకులు 4 బ్యాంకులుగా మారిపోయాయి. మిగిలిన బ్యాంకులేవో తెలుసుకోండి.

    బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనమయ్యాయి. ఏప్రిల్ 1న నాలుగు బ్యాంకులుగా మారిపోయాయి. అతిపెద్ద బ్యాంకుల విలీన ప్రక్రియ ఇది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా మారుస్తామని 2019 ఆగస్ట్‌లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 10 బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి 4 బ్యాంకులుగా సేవలు అందించనున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఈ బ్యాంకుల విలీనం వాయిదా పడొచ్చని అందరూ భావించారు. కానీ ముందే ప్రకటించినట్టుగా ఏప్రిల్ 1న విలీనమైపోయాయి. విలీనమైన బ్యాంకు కస్టమర్లంతా ఇకపై విలీనం చేసుకున్న బ్యాంకు కస్టమర్లుగా సేవలు పొందొచ్చు.

    Banks Merger: బ్యాంకుల విలీనం జరిగింది ఇలాగే...


    Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమయ్యాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తర్వాత అతిపెద్ద బ్యాంకుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ మారిపోయింది.

    Canara Bank: కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. దీంతో కెనెరా బ్యాంక్ నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది.

    Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనమయ్యాయి.

    Indian Bank: ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం అయ్యాయి.

    అతిపెద్ద బ్యాంకుల విలీన ప్రక్రియ ముగియడంతో 2017 లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటే ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు ఇతర బ్యాంకుల్ని విలీనం చేసుకున్నాయి. మిగతా ఆరు ఇండిపెండెంట్ బ్యాంకులుగా ఉన్నాయి. అవి ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తైపోయింది కాబట్టి కస్టమర్లు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ అకౌంట్లు, ఇతర వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    Savings: బ్యాంకులో డబ్బులు దాచుకున్నవారికి షాక్... ఎవరికి ఎంత నష్టమంటే

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక... ఈ విషయాలు మర్చిపోవద్దు

    EPF Withdrawal: ఈపీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు మారాయి... కొత్త రూల్స్ ఇదే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Allahabad Bank, Andhra bank, Bank, Bank account, Bank loans, Bank of Baroda, Bank of India, Banking, Banks merger, Canara Bank, Central Bank of India, Corporation Bank, Indian Bank, Indian Overseas Bank, Oriental Bank of Commerce, Personal Finance, Punjab National Bank, Rbi, Reserve Bank of India, Sbi, State bank of india, Syndicate Bank, UCO Bank, Union bank of india, United Bank of India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు