హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Offers: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐసీఐసీఐ వరకు.. కస్టమర్లకు బ్యాంకుల భారీ ఆఫర్లు!

Bank Offers: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐసీఐసీఐ వరకు.. కస్టమర్లకు బ్యాంకుల భారీ ఆఫర్లు!

 ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐసీఐసీఐ వరకు.. కస్టమర్లకు బ్యాంకుల భారీ ఆఫర్లు!

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ నుంచి ఐసీఐసీఐ వరకు.. కస్టమర్లకు బ్యాంకుల భారీ ఆఫర్లు!

Festive Offers | బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చాయి. పండుగ డిమాండ్‌ను ఎలాగైనా అందింపుచ్చుకోవాలని బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Banks | కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఫెస్టివ్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, టెంప్ట్ చేసే డీల్స్‌తో బ్యాంక్ ఖాతాదారులకు (Bank Customers) వల వేయాలని చూస్తున్నాయి. ఇటీవల కాలంలో పలు రకాల బ్యాంకులు పలు రకాల షాపింగ్ (Shopping) డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఫెస్టివ్ సీజన్ లక్ష్యంగా బ్యాంకులు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. బ్యాంక్ వెబ్‌సైట్లు కూడా ఆకర్షణీయ షాపింగ్ ఆఫర్లతో నిండిపోతున్నాయి. బ్యాంకింగ్ ప్రొడక్టులపై డిస్కౌంట్ అందిస్తున్నాయి.

  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకులు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇవి కూడా కస్టమర్ల కోసం డీల్స్ తీసుకువచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓనమ్ ఫెస్టివ్ ట్రీట్స్ సందర్భంగా 12 రకాల డిస్కౌంట్ ఆఫర్లు తీసుకువచ్చింది. కేరళలో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు దసరా, దీపావళి సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆఫర్ల వెల్లువ రానుంది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, కొనుగోలుపై డిస్కౌంట్లు, తక్కువ వడ్డీ రేటు వంటి ఆఫర్లు లభించనున్నాయి. ఫెస్టివ్ ట్రీట్స్ కింద బ్యాంక్ 10 వేల డీల్స్ అందిస్తోంది.

  రాత్రికి రాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

  అలాగే మరో ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా మాన్‌సూన్ బొనాంజా ఆఫర్ తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్లు పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే మరో ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కూడా తక్కువేమీ కాదు. ఈ బ్యాంక్ కొచ్చి1 ప్రిపెయిడ్ కార్డు తీసుకువచ్చింది. కొచ్చి మెట్రో ప్రయాణికులకు కోసం దీన్ని ఆవిష్కరించింది. దీని ద్వారా ఏకంగా టికెట్ ధరపై 20 శాతం తగ్గింపు అందిస్తోంది. ఇంకా సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ప్రిఅప్రూవ్డ్ కార్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. అలాగే గ్రూప్ పర్సనల్ లోన్స్‌పై రాయితీ అందిస్తోంది.

  పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి ప్రతి నెలా డబ్బులు.. ఎప్పటి నుంచి వస్తాయో తెలుసా?

  అంతేకాకుండా బ్యాంకులు డిపాజిట్‌దారులను ఆకర్షిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఇటీవల ఉత్సవ్ పేరుతో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ తెచ్చింది. దీనిపై వడ్డీ రేటు 6.1 శాతంగా ఉంది. దీని టెన్యూర్ 1000 రోజులు. కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటివి కూడా ఇలాంటి సర్వీసులు అందిస్తోంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా బ్యాంకుల దారిలోనే నడుస్తున్నాయి. పండు సీజన్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని రెడీ అవుతున్నాయి. అందువల్ల కస్టమర్లకు ఈ పండుగ సీజన్‌లో సూపర్ డీల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొంత కాలం వేచి చూస్తే సరిపోతుంది. వచ్చే వారం నుంచి ఆఫర్ల జాతర ప్రారంభం కానుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank, Bank loans, Car loans, Online shopping, Personal Finance

  ఉత్తమ కథలు