Interest Rates | మీరు ప్రతి నెలా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే ప్రస్తుతం బ్యాంకులు డిపాజిట్లపై (Deposits) వడ్డీ రేట్లు పెంచేశాయి. ఫిక్స్డ్ డిపాజిట్లతో (Fixed Deposits) పాటుగా రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుంది. ప్రతి నెలా డబ్బులు డిపాజిట్ చేసుకున్నా అధిక రాబడి పొందొచ్చు.
దేశంలో చాలా బ్యాంకులు 6 నెలల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో రికరింగ్ డిపాజిట్లు అందుబాటులో ఉంచాయి. ఎస్బీఐ ఆర్డీ రేట్లను గమనిస్తే.. స్టేట్ బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిస్తే.. 6.1 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఏడాదినుంచి పదేళ్ల టెన్యూర్‌లోని ఆర్డీలకు ఇది వర్తిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్ అయితే 6.25 శాతం వడ్డీ వస్తుంది. ఇక మిగతా వాటిపై 6.1 శాతం వడ్డీ ఉంది.
ఈ నెలలో భారీ లాభాలు అందించిన 10 స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవే!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఆర్డీ ఖాతా తెరిస్తే.. ఆరు నెలల టెన్యూర్‌పై 4.5 శాతం వడ్డీ పొందొచ్చు. 9 నెలల రికరింగ్ డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ వస్తుంది. 12 నెలల ఆర్డీలపై 6.1 శాతం వడ్డీ ఉంది. 15 నెలల నుంచి 24 నెలల రికరింగ్ డిపిజట్లపై 6.15 శాతం వడ్డీ పొందొచ్చు. 90 నెలల నుంచి 120 నెలల ఆర్డీలపై 6.2 శాతం వడ్డీ లభిస్తోంది.
జనాలు ఎక్కువగా కొంటున్న టాప్ 10 బైక్స్ ఇవే.. వీటి క్రేజ్ వేరే లెవెల్!
ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్లను గమనిస్తే.. 6 నెలల నుంచి పదేళ్ల దాకా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. వడ్డీ రేటు 4.25 శాతం నుంచి 6.2 శాతం వరకు ఉంది. ఈ దిగ్గజ బ్యాంకులు అన్నీ కూడా ఇటీవలనే రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. అందువల్ల గతంలో కన్నా ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ల రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి అధిక రాబడి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కసారి ఆర్డీ లేదా ఎఫ్డీ అకౌంట్ తెరిస్తే.. టెన్యూర్ అయిపోయేంత వరకు వడ్డీ రేటు స్థిరంగానే ఉంటుంది. మార్పు ఉండదు. కొత్త ఖాతాలకు మాత్రమే కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కేవలం ఈ బ్యాంకులు మాత్రమే కాకుండా మీ అందుబాటులో ఉన్న ఇతర బ్యాంకుల్లో కూడా వడ్డీ రేట్లను చెక్ చేసుకొని ఎందులో అయితే ఎక్కువ వడ్డీ ఉందో అక్కడ ఆర్డీ ఖాతా తెరవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, HDFC bank, Icici bank, Personal Finance, Recurring Deposits, Sbi