BANKS HIKE FD RATES TIPS FOR SENIOR CITIZENS TO MAXIMISE INVESTMENT RETURNS GH VB
Fixed Deposits: ఎఫ్డీ రేట్లను పెంచుతున్న బ్యాంకులు.. సీనియర్ సిటిజన్లు అధిక రాబడి పొందే మార్గాలు తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఎకానమీ ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరగడానికి ఆస్కారం ఉంది. అందువల్ల సీనియర్ సిటిజన్లు పెట్టుబడి విషయంలో సరైన వ్యూహం అవలంభించాల్సిన అవసరం ఉంది.
సీనియర్ సిటిజన్ల(Senior Citizens) పెట్టుబడి అవసరాలు ఇతరులతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వారు అప్పటికే రిటైర్డ్(Retired) అయి ఉంటారు. దీంతో తక్కువ రిస్క్(Risk) ఉన్న వాటిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన మార్గం. మార్కెట్ల ఒడిదుడుకుల నుంచి వారు కోలుకోవడం అంత సులువు కాదు. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి సీనియర్ సిటిజన్లు ప్రాధాన్యత చూపిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్లతో(Deposits) అనేక ప్రయోజనాలు ఉంటాయి. FDలను అవసరం అనుకుంటే ఎప్పుడైనా లిక్విడేషన్ రూపంలోకి మార్చుకోవచ్చు. భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టవచ్చు. రిటర్న్స్‌కు గ్యారెంటీ కూడా ఉంటుంది. లోన్స్ అవసరమైనప్పుడు FDలు కొల్లేటరల్గా కూడా ఉపయోగపడతాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా ఎకానమీ ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరగడానికి ఆస్కారం ఉంది. అందువల్ల సీనియర్ సిటిజన్లు పెట్టుబడి విషయంలో సరైన వ్యూహం అవలంభించాల్సిన అవసరం ఉంది.
లాంగ్‌టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకోవద్దు
సుదీర్ఘ కాలం ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండే కష్టనష్టాలను సీనియర్ సిటిజన్లు నివారించవచ్చు. ఇందు కోసం స్వల్ప కాల వ్యవధి ఉన్న FDల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమ మార్గం. దీంతో పెరుగుతున్న వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు పెనాల్టీని భరించాలనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లను ఎక్కువ కాలం పాటు లాక్ చేయడంతో వచ్చే ప్రయోజనాలను సీనియర్ సిటిజన్లు పొందలేరు.
బ్యాంకు ఎంపికలో తెలివిగా వ్యవహరించడం
వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి. సురక్షితమైనవిగా పేరొందిన పెద్ద బ్యాంకులు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి. కానీ, చిన్న బ్యాంకుల్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నవి కనుక ఎక్కువ వడ్డీరేటును ఆఫర్ చేస్తాయి. రిస్క్, ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని సగటు రాబడి వచ్చే విధంగా వివిధ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమైన మార్గం. చిన్న బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తున్నప్పుడు, RBI అందించిన రూ. 5 లక్షల డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను మీరు పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఈ పరిమితికి లోబడే పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అలాగే బ్యాంకు స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ సిటిజన్లు పెద్దమొత్తంలో కూడా పెట్టుబడిపెట్టుకోవచ్చు.
FD ల్యాడరింగ్కు ప్రాధాన్యత ఇవ్వండి
మీరు పెద్దమొత్తంలో సిగిల్ డిపాజిట్ చేసినట్లయితే దాన్ని అయితే అనేక డిపాజిట్లుగా విభజించడం ఉత్తమం. దీని ద్వారా మారుతున్న మీ డిపాజిట్ల మెచ్యూరిటీలు సగటు రాబడిని మెరుగుపరుస్తాయి. జీవితంలో మలి దశలో ఉన్న సీనియర్ సిటిజన్లకు లిక్విడిటీ క్యాష్ అందుబాటులో ఉంటుంది. దీంతో అధిక వడ్డి రేట్లు కోసం డిపాజిట్లను పునరుద్దరించడానికి అవకాశం ఏర్పడుతుంది.
మీకు 10 లక్షల సిగిల్ డిపాజిట్ ఉంటే, దాన్ని ఐదు డిపాజిట్లుగా విభజించండి. దీంతో రూ.2 లక్షలతో ఒక్కో డిపాజిటిట్ను సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు ఇలా వివిధ కాల వ్యవధి మెచ్యూరిటితో డిపాజిట్ చేయండి. ప్రతి డిపాజిట్ మెచ్యూరిటీ తర్వాత, వచ్చే రాబడిని మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. లేకపోతే అధిక వడ్డీ కోసం మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు. ఒకే బ్యాంకులో పిక్స్డ్ డిపాజిట్ చేయడం బదులుగా అధిక సగటు రాబడిని అందించే వివిధ బ్యాంకుల ద్వారా FD ల్యాడర్ సౌకర్యం వినియోగించుకోవచ్చు.
తక్కువ నుంచి ఎక్కు వడ్డీ రేటు FDలకు మారడం
సీనియర్ సిటిజన్లు ఇప్పటికే తక్కువ రేటు FDలను కలిగి ఉన్నట్లయితే .. మారడానికి ముందు వడ్డీ రేట్లు పెరిగే వరకు వేచి చూడండి. అధిక రేట్ల కోసం పాత డిపాజిట్లను ఉన్నట్టుండి ఉపసంహరించుకుంటే పెనాల్టీ రేట్ .... వడ్డీ కంటే తక్కువగా ఉండాలి. సంవత్సరానికి 5% చెల్లించే మీ ప్రస్తుత FD నుండి నిష్క్రమిస్తే, మీరు 0.5% పెనాల్టీని చెల్లించవలసి ఉంటుంది. దీంతో మీకు వచ్చే వడ్డీ రేటు 4.5%కి తగ్గుతుంది. అయితే, కొత్త FDలు సంవత్సరానికి 6% వడ్డీకి అందిస్తే, పెనాల్టీ ఉన్నప్పటికీ మీరు ప్రయోజనం పొందుతారు.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఫిక్స్ డ్ డిపాజిట్ల వడ్డీ ఆదాయంలో సీనియర్ సిటిజన్లు రూ. 50 వేల వరకు ట్యాక్స్ మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటే దాని ద్వారా వచ్చే ఆదాయం మరింత పెరగటానికి అవకాశం ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.