హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు.. 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు.. 7 శాతం కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే

ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే

Fixed Deposit | ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో ఆయా బ్యాంకులు డిపాజిట్లపై 7 శాతం కంటే ఎక్కువ వడ్డీరేట్లను అందిస్తున్నాయి. వాటిపై ఇప్పుడో లుక్కేద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Bank FD Rates | ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు గత ఐదు నెలల్లో ఆర్‌బీఐ (RBI) రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో రెపో రేటు ఇప్పుడు 5.9 శాతానికి చేరుకుంది. ఈ రేటు పెరగడం వల్ల రుణ గ్రహీతలపై భారం పడుతుంది కానీ బ్యాంక్‌ సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs), రికరింగ్ డిపాజిట్ల (RD) ఉన్నవారికి లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఈ రేటు పెరగగానే ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు టర్మ్ డిపాజిట్ల (Term Deposits)పై వడ్డీ రేటు (Interest Rates)ను పెంచుతాయి. తద్వారా పెట్టుబడిదారులకు అధిక వడ్డీ లభిస్తుంది. అయితే ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో ఆయా బ్యాంకులు డిపాజిట్లపై 7% కంటే ఎక్కువ వడ్డీరేట్లను అందిస్తున్నాయి. వాటిపై ఇప్పుడో లుక్కేద్దాం.

ప్రస్తుతం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్‌ 7% కంటే ఎక్కువ FD రేట్లను అందిస్తున్నాయి. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 7.5% వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లను పొందాలంటే ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో పెట్టుబడి కాలపరిమితి 1,000 రోజులు ఉండాలి. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో పెట్టుబడి కాలపరిమితి 525 రోజులు, 990 రోజులు ఉండాలి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 999 రోజులు మెచూర్ అయ్యే డిపాజిట్లకు 7.49% వడ్డీని అందిస్తుంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల కంటే ఎక్కువ కాలపరిమితి గల ఎఫ్‌డీలపై 7.35 శాతం అందిస్తుంది. ఈ ఎఫ్‌డీలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో మెచూర్ అవ్వాల్సి ఉంటుంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 888 రోజుల వ్యవధి గల ఎఫ్‌డీలపై 7.32% ఆఫర్ చేస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. వారికి అదిరిపోయే శుభవార్త

ఆర్‌బీఎల్ బ్యాంక్ 15 నెలల్లో మెచూర్ అయ్యే ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీ అందిస్తోంది. ఇక 15 నెలల 1 రోజు నుంచి 725 రోజుల కాలపరిమితి గల ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7%, సీనియర్ సిటిజన్లకు 7.50%.. 725 రోజుల్లో మెచూర్ అయ్యే ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7.25%.. సీనియర్ సిటిజన్‌లకు 7.75%.. 726 రోజుల నుంచి 24 నెలలలోపు మెచూర్ అయ్యే ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7%.. సీనియర్ సిటిజన్లకు 7.50% ఇస్తోంది. ఈ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి.

ఈరోజు నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. దీపావళి ముందు కస్టమర్లకు భారీ షాకిచ్చిన ఆర్‌బీఐ

బంధన్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు గమనిస్తే.. 18 నెలల - 2 ఏళ్ల కంటే తక్కువ వ్యవధిలోపు ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7.00%.. సీనియర్ సిటిజన్లకు 7.50%.. 2 ఏళ్లు - 3 ఏళ్ల కంటే వ్యవధిలోపు ఎఫ్‌డీలపై జనరల్ యూజర్లకు 7.00%, సీనియర్ సిటిజన్లకు 7.50%.. 3 ఏళ్ల - 5 ఏళ్ల కంటే వ్యవధిలోపు ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7.00%.. సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీని బంధన్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు ఆగస్టు 22 నుంచి అమలులోకి వస్తాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లను పరిశీలిస్తే.. ఈ బ్యాంక్ 750 రోజుల్లో మెచూర్ అయ్యే ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7.25%.. సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ ఇస్తోంది. ఈ రేట్లు అక్టోబర్ 10 నుంచి అమలులోకి వచ్చాయి.

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7% కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంక్ ఇటీవల రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. కెనరా బ్యాంక్ 666 రోజుల కాలవ్యవధి కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ప్రకారం, బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7% వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లు 7.5% అందిస్తోంది.

First published:

Tags: Banks, FD rates, Fixed deposits, Rbi, Repo rate

ఉత్తమ కథలు