హోమ్ /వార్తలు /బిజినెస్ /

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ప్రముఖ బ్యాంకులు.. ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకులు ఇవే..

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను పెంచిన ప్రముఖ బ్యాంకులు.. ఎక్కువ వడ్డీని అందించే బ్యాంకులు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బ్యాంక్ బజార్ డేటా ప్రకారం.. 2022, అక్టోబర్ 25 నాటికి ఎక్కువ వడ్డీతో ఎఫ్‌డీలను అందిస్తున్న బ్యాంకులు ఏవో చూద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

FD Rates : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలక వడ్డీరేట్లను సవరించిన తర్వాత, దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ లోన్లతో పాటు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచాయి. పండుగ సీజన్‌ స్పెషల్ ఆఫర్లలో భాగంగా, చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇతర బ్యాంకులు వివిధ మెచ్యూరిటీతో అందించే డిపాజిట్లపై ఇంట్రస్ట్ రేట్స్ పెంచాయి. అయితే వీటితో పోలిస్తే కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యధిక వడ్డీ రేట్లతో ఎఫ్‌డీలను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ బజార్ డేటా ప్రకారం.. 2022, అక్టోబర్ 25 నాటికి ఎక్కువ వడ్డీతో ఎఫ్‌డీలను అందిస్తున్న బ్యాంకులు ఏవో చూద్దాం.

చిన్న ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడం కోసం ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్.. ఎఫ్‌డీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రూ. 5 లక్షల వరకు హామీ ఇస్తుంది. వెయ్యి రోజుల ఇన్వెస్ట్‌మెంట్ టెన్యూర్‌తో SBI అందిస్తున్న ఎఫ్‌డీపై వడ్డీరేటు 6.10 శాతంగా ఉంది. అలాగే 555 రోజుల ఎఫ్‌డీపై బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరు శాతం వడ్డీని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మూడు నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీపై 6.10 శాతం, IDBI బ్యాంకు 555 రోజుల FDపై 6.40 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

వీటిలో ఏడు శాతానికి పైగా..

సిటీ యూనియన్ బ్యాంక్, DCB బ్యాంకులు 700 రోజుల FDలపై 7.10 శాతం వడ్డీని అందిస్తాయి.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.7 శాతం వడ్డీని అందిస్తోంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఇదే అత్యుత్తమ వడ్డీ రేటు కావడం విశేషం. 990 రోజుల ఎఫ్‌డీపై ఈ రేటు వర్తిస్తుంది.

ఫెడరల్ బ్యాంక్

ప్రైవేట్ బ్యాంకులలో బెస్ట్ వడ్డీ రేటును అందిస్తున్న సంస్థగా నిలుస్తోంది ఫెడరల్ బ్యాంక్. ఈ బ్యాంక్ 700 రోజుల ఇన్వెస్ట్‌మెంట్ టెన్యూర్‌తో అందిస్తున్న ఎఫ్‌డీపై గరిష్టంగా 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.

Google Chrome: క్రోమ్ యూజర్లకు ఇక బ్యాటరీ డ్రెయిన్‌ సమస్య ఉండదు.. ఎందుకంటే..

 ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 888 రోజుల ఎఫ్‌డీలపై 7.50 శాతం వడ్డీని అందిస్తోంది.

 సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

ఈ బ్యాంకు 999 రోజుల ఇన్వెస్ట్‌మెంట్ టెన్యూర్‌తో అందిస్తున్న 7.49 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.

ఈ బ్యాంకుల్లో 7.25 శాతం

IDFC ఫస్ట్ బ్యాంక్, RBL బ్యాంక్, యెస్ బ్యాంకులు FDలపై 7.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ టెన్యూర్ వరుసగా 750 రోజులు, 725 రోజులు, 20-22 నెలలుగా ఉన్నాయి.

కర్ణాటక బ్యాంక్

555 రోజుల FDలపై ఈ బ్యాంకు 7.20 శాతం వడ్డీని అందిస్తుంది.

First published:

Tags: Bank, FD rates, Fixed deposits

ఉత్తమ కథలు