సొంత ఇల్లు మీ కలా? హోమ్ లోన్ తీసుకొని మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారా? ఇటీవల బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్‌ను 40 బేసిస్ పాయింట్స్ తగ్గించి 4 శాతానికి, రివర్స్ రెపో రేట్‌ను 40 బేసిస్ పాయంట్స్ తగ్గించి 3.35 శాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. బ్యాంకులు మాత్రమే కాదు... ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ కూడా హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఆల్ టైమ్ లో స్థాయికి తగ్గించేంసింది. బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు పోటాపోటీగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించడం కస్టమర్లకు శుభవార్తే. ఒకప్పుడు హోమ్ లోన్ వడ్డీ రేటు 9 శాతం పైనే ఉండేది. కానీ ఇప్పుడు 7 శాతం వడ్డీకే హోమ్ లోన్ తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులైతే అంతకన్నా తక్కువ వడ్డీకే గృహరుణాలను ఇస్తున్నాయి. మరి మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఏ బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తున్నాయో తెలుసుకోండి.
Loan: చిరువ్యాపారులకు మోదీ ప్రభుత్వం లోన్... అప్లై చేయండిలా
SBI Health Policy: ఎస్బీఐ ఆరోగ్య సంజీవని... తక్కువ ధరకే హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.95%
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.7-7.15%
బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85- 7.85%
బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85-8.35%
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.85-9.05%
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 6.9-7.25%
కెనెరా బ్యాంక్- 6.9-8.90%
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 6.95-7.85%
ఐసీఐసీఐ బ్యాంక్- 6.95-8.05%
పంజాబ్ నేషనల్ బ్యాంక్- 7-7.6%
ఇండియన్ బ్యాంక్- 7%
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 7.05-7.3%
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.05-8.45%
యూకో బ్యాంక్- 7.15-10.45%
ఐడీబీఐ బ్యాంక్- 7.5-9%
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- 6.90-7.20%