Bank Account Closed: జూలై 31 తర్వాత మీ బ్యాంక్​ అకౌంట్ క్లోజ్​ అయిందా? ఇలా చెక్​ చేసుకోండి

Bank Account Closed: జూలై 31 తర్వాత మీ బ్యాంక్​ అకౌంట్ క్లోజ్​ అయిందా? ఇలా చెక్​ చేసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Bank Account Closed | జూలై 31 తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిందా? ఓసారి మీ అకౌంట్ చెక్ చేసుకోండి. ఎందుకు క్లోజ్ అయిందో తెలుసుకోండి.

  • Share this:
డిజిటల్​ యుగంలో బ్యాంకింగ్​ ట్రాన్సాక్షన్స్​​ బాగా పెరిగిపోయాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ బ్యాంక్​ లావాదేవీలపై, నియమ నిబంధనలపై తప్పనిసరిగా అవగాహన ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే చాలా మంది అవసరం లేకున్నా వివిధ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్​ చేస్తుంటారు. తర్వాత వాటి ద్వారా ఎలాంటి ట్రాన్సాక్షన్స్​ నిర్వహించరు. ఇలాంటి కరెంట్​ అకౌంట్లను ఇనాక్టివ్​ చేయాలని ఆర్​బీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్‌బిఐ ఆదేశాలను పాటించడంలో విఫలమైన అనేక కరెంట్ అకౌంట్లను ఇటీవల క్లోజ్​ చేసింది. మీడియా నివేదికల ప్రకారం కస్టమర్లు తమ సంబంధిత బ్యాంకు అకౌంట్లు క్లోజ్​ అయ్యాయా? అనే విషయం వారి రిజిస్టర్​ ఈ-మెయిల్‌ ఐడీకి బ్యాంకులు పంపించామని తెలిపింది.

PAN Card: అలర్ట్... ఈ 18 ట్రాన్సాక్షన్స్‌కు పాన్ కార్డ్ తప్పనిసరి

Aadhaar Card: చనిపోయినవారి ఆధార్ నెంబర్ ఏం అవుతుంది? ప్రభుత్వం ఆలోచన ఇదే

ఆర్​బీఐ పేర్కొన్న నిబంధనలివే..


సేవింగ్స్​, కరెంట్ అకౌంట్ల మధ్య అనేక తేడాలుంటాయి. సేవింగ్స్​ అకౌంట్​లో చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్స్​ వరకే అనుమతిస్తారు. అదే కరెంట్ అకౌంట్​ ద్వారా అయితే రోజులో పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్​ నిర్వహించుకోవచ్చు. సాధారణంగా బిజినెస్​ చేసే వారు ఈ అకౌంట్లను ఓపెన్​ చేస్తుంటారు. అయితే ట్రాన్సాక్షన్స్​కు తగ్గట్లే మినిమం బ్యాలెన్స్​ కూడా ఎక్కువగా మెయింటెయిన్​ చేయాల్సి ఉంటుంది. ​ఇలా మెయింటెయిన్​ చేయని అకౌంట్లను క్లోజ్​ చేయాలని ఆర్​బీఐ నిర్ణయించింది. అంతేకాదు, ఇతర బ్యాంకులు, ఫైనాన్షియల్​ సంస్థల నుంచి లోన్లు తీసుకున్న కస్టమర్లకు కరెంట్ అకౌంట్లను తెరవొద్దని బ్యాంకులకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్‌బీఐ 2020 ఆగస్టులో విడుదల చేసిన సర్క్యులర్​లో ఈ నిబంధనలను పొందుపర్చింది.

Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఈ రెండు సేవలు లభించవు

Business Idea: స్మార్ట్‌ఫోన్‌తో ఆన్‌లైన్ బిజినెస్... నెలకు రూ.30,000 ప్రాఫిట్... మీరూ చేయొచ్చు ఇలా

నిబంధలను పాటించని అకౌంట్లను 2021 జూలై 31లోపు క్లోజ్​ చేయాలని చెప్పింది. ఈ గడువు కూడా ఇప్పుడు ముగిసింది. మరోవైపు క్యాష్​ క్రెడిట్ (CC)/ ఓవర్‌డ్రాఫ్ట్ (OD) రూపంలో క్రెడిట్ సేవలు పొందే కస్టమర్లకు ఏ బ్యాంకు అయినా సరే కరెంట్ ఖాతాలను తెరవకూడదని పేర్కొంది. అన్ని ట్రాన్సాక్షన్స్​ను CC/ OD ఖాతా ద్వారానే ప్రాసెస్​ చేయాలని RBI తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. కస్టమర్లు ఈ సూచనలన్నీ పాటించేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. దీనికి అనుగుణంగా అన్ని కరెంట్ అకౌంట్లు, CC/OD లను క్రమం తప్పకుండా మానిటర్​ చేయాలని తెలిపింది. కనీసం మూడు నెలలకోసారైనా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది.
Published by:Santhosh Kumar S
First published: