Home /News /business /

BANKS AND HOUSING FINANCE COMPANIES THAT OFFER THE CHEAPEST HOME LOANS UMG GH

Home Loans: హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? అబ్బా, మీ పంట పండినట్టే.. తక్కువ వడ్డీకే లోన్లు.. ఇదిగో లిస్ట్..!

హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? అబ్బా, మీ పంట పండినట్టే.. తక్కువ వడ్డీకే లోన్లు.. ఇదిగో లిస్ట్..!

హోమ్ లోన్ తీసుకుంటున్నారా..? అబ్బా, మీ పంట పండినట్టే.. తక్కువ వడ్డీకే లోన్లు.. ఇదిగో లిస్ట్..!

ప్రస్తుతం అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.75 లక్షల హోమ్‌ లోన్‌లపై 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఉన్న సంస్థలు ఏవో చూద్దాం.

ఇటీవల కాలంలో హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు పెరిగాయి. అయితే మే, జూన్‌లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెపో రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు సార్లు రెపో రేటు పెరగడంతో హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు పెరిగాయి. ఆర్‌బీఐ రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచడంతో తాజా రేటు 4.9 శాతానికి పెరిగింది. 2019 అక్టోబర్ 1 తర్వాత మంజూరైన అన్ని రిటైల్ ఫ్లోటింగ్-రేట్ హోమ్ లోన్‌లు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో లింక్ అయ్యాయి. ఫలితంగా, హోమ్‌ లోన్‌లు ఖరీదైనవిగా మారాయి. రుణాలు తీసుకునే వారికి వడ్డీ భారం పెరిగింది. ఆగస్టు 5న జరగనున్న సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును మళ్లీ పెంచితే.. ఈ రేట్లు మరింత పెరగవచ్చు. ప్రస్తుతం బ్యాంక్‌బజార్.కామ్‌ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.75 లక్షల హోమ్‌ లోన్‌లపై 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఉన్న సంస్థలు ఏవో చూద్దాం.

* ఆయా బ్యాంకులు అందిస్తున్న హోమ్‌ లోన్‌ రేట్‌లు ఇవే..
బ్యాంక్‌బజార్ డేటా ప్రకారం.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రస్తుతం 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.75 లక్షల హోమ్‌ లోన్‌పై అతి తక్కువ వడ్డీ 7.15 శాతంతో లోన్‌లు మంజూరు చేస్తోంది.

* రూ.75 లక్షల హోమ్‌ లోన్‌లపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్ 7.2 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ రేటుతో EMI రూ.59,051గా ఉండే అవకాశం ఉంది.

* ఈ మొత్తం లోన్‌పై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 7.3 శాతం వడ్డీ రేటును విధిస్తున్నాయి. హోమ్‌ లోన్‌ తీసుకున్న వారు నెలవారీ EMI రూ.59,506 చెల్లించాల్సి వస్తుంది.

ఇదీ చదవండి: నయా ట్రెండ్ సెట్ చేసిన ముస్లిం వధువు.. ఏం చేసిందో చదివితే అభినందిస్తారు !


* పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, UCO బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ.75 లక్షల గృహ రుణంపై EMI రూ.59,962గా ఉంటుంది.

* 7.45 శాతంతో బ్యాంక్ ఆఫ్ బరోడా(BoB) హోమ్‌ లోన్‌లను అందిస్తోంది. కొంచెం ఎక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తోంది. ఈ సందర్భంలో రుణగ్రహీతలు రూ.60,190 EMI చెల్లించాలి.

* LIC హౌసింగ్ ఫైనాన్స్ 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.75 లక్షల గృహ రుణంపై 7.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. IDBI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకే వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. వీటి హోమ్‌ లోన్‌పై EMI రూ.60,419గా ఉంటుంది.



* భారతదేశపు ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7.55 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కెనరా బ్యాంక్ కూడా 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.75 లక్షల హోమ్‌ లోన్‌పై అదే రేటును వసూలు చేస్తుంది. వీటిల్లో EMI రూ.60,649 చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Mahesh
First published:

Tags: Home loans, Housing Loans, Interest rates, Rbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు