ఒకప్పుడు పెళ్లిళ్లు సింపుల్‌గా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పెళ్లిళ్లంటే ఎంగేజ్‌మెంట్ దగ్గర్నుంచి రిసెప్షన్ వరకు అన్నీ గ్రాండ్‌గా ఉండాల్సిందే. హంగులు, ఆర్భాటాలు పెరుగుతున్నకొద్దీ ఖర్చులూ పెరిగిపోతుంటాయి. దీంతో వివాహం చేయడం భారంగా మారుతుంది. సింపుల్‌గా పెళ్లి చేయాలన్నా మధ్యతరగతి కుటుంబాలకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంకా గ్రాండ్‌గా చేయాలనుకుంటే ఖర్చు పెరిగిపోతుంది. కస్టమైజ్డ్ వెడ్డింగ్ ఇన్విటేషన్, డిజైనర్ దుస్తులు, మెహందీ ఫంక్షన్, సంగీత్ వేడుక, పెళ్లి వంటకాలు, అతిథులకు రిటర్న్ గిఫ్ట్స్... ఇలా ప్రతీది ఖర్చుతో కూడుకున్నదే. ఇంతటితో ఖర్చులు ఆగిపోవు. రిసెప్షన్, హనీమూన్ కోసం ఫారిన్ టూర్... ఈ ఖర్చులు కూడా ఉంటాయి.
జీవితంలో ఒకే ఒక్కసారి జరుపుకొనే పెళ్లి వేడుక ఘనంగా చేయాలన్న ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఆర్థిక స్తోమత సరిపోకపోవచ్చు.పెళ్లికీ లోన్ (Marriage Loan) తీసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? బ్యాంకులు వెడ్డింగ్ లోన్ (Wedding Loan) పేరుతో ఈ రుణాలు ఇస్తుంటాయి. ఎక్కువగా ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇలాంటి రుణాలు ఇస్తుంటాయి. అయితే పెళ్లి కోసం రుణానికి అప్లై చేసేవారి అర్హత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వెడ్డింగ్ లోన్ అర్హతలకు సంబంధించి వేర్వేరు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల అర్హతలు, నియమనిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.
IRCTC Valentine Special Tour: వాలెంటైన్స్ డే స్పెషల్... ఐఆర్‌సీటీసీ థాయ్‌ల్యాండ్ టూర్ ప్యాకేజీ
వెడ్డింగ్ లోన్ కోసం దరఖాస్తుదారుల వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి. కొన్ని సంస్థలు కనీస వయస్సు 23 ఏళ్లు ఉండాలని షరతు విధిస్తున్నాయి. ఇక గరిష్ట వయస్సు 58 ఏళ్లు. పెళ్లికి రుణాలు తీసుకునేవారి నెలసరి ఆదాయం రూ.15,000 నుంచి రూ.25,000 ఉన్నా చాలు. బ్యాంకులు వెడ్డింగ్ రుణాలు ఇచ్చేస్తాయి. ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందే వ్యక్తులు, వేతనజీవులు వివాహ రుణాలు తీసుకోవచ్చు.
వెడ్డింగ్ లోన్ తీసుకోవాలంటే తమ ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. వేతనజీవులైతే ప్రస్తుత ఉద్యోగంలో కనీసం ఒక ఏడాదిగా పనిచేస్తూ ఉండాలి. మొత్తంగా కనీసం రెండు సంవత్సరాలు ఉద్యోగిగా ఉండాలి. వెడ్డింగ్ లోన్ కోసం క్రెడిట్ స్కోర్ కూడా తప్పనిసరి. సిబిల్ స్కోర్ 700 పైన ఉన్నవారికి వెడ్డింగ్ లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి బ్యాంకులు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది.
RBI New Rules: బ్యాంక్ కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్... కొత్త రూల్స్‌తో ఊరట
ఇక వెడ్డింగ్ లోన్ ఎంత ఇస్తారన్నది బ్యాంకును బట్టి, ఫైనాన్స్ సంస్థను బట్టి మారుతూ ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.50 లక్షల వరకు వెడ్డింగ్ లోన్ తీసుకోవచ్చు. అయితే లోన్ తీసుకునే వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్ లాంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Marriage, Personal Finance, Personal Loan, Wedding