BANKING UPDATE CHEQUE CLEARING SYSTEM WILL CHANGE FROM SEPTEMBER 1 MK GH
Positive pay system: యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఇకపై ఆ రూల్స్ మారనున్నాయి..!
(ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంకింగ్ రంగంలోని చెక్ మోసానికి కళ్లెం వేసేందుకు జనవరి 1, 2021 నుంచి పాజిటివ్ పే వ్యవస్థను అమలు చేయాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. నిజానికి ఆర్బీఐ 2020లో చెక్ కోసం ''పాజిటివ్ పే సిస్టమ్'' ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమరా..? అయితే మీకొక గుడ్ న్యూస్. ఆర్బీఐ ప్రతిపాదించిన పాజిటివ్ పే విధానాన్ని పాటించేందుకు యాక్సిస్ బ్యాంకు ముందుకొచ్చింది. చెక్ బుక్ మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ పాజిటివ్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి విదితమే. సెప్టెంబర్ 1, 2021 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యాక్సిస్ బ్యాంక్ నిర్ణయించింది. దీని గురించి అనేక మంది యూజర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తోంది.
అసలు ఇంతకీ పాజిటివ్ పే అంటే ఏంటి?
బ్యాంకింగ్ రంగంలోని చెక్ మోసానికి కళ్లెం వేసేందుకు జనవరి 1, 2021 నుంచి పాజిటివ్ పే వ్యవస్థను అమలు చేయాల్సిందిగా బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. నిజానికి ఆర్బీఐ 2020లో చెక్ కోసం ''పాజిటివ్ పే సిస్టమ్'' ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. భారీ మొత్తంలో చెల్లింపులకు కీలక వివరాల కోసం రీ-కన్ఫర్మేషన్ అవసరం అయ్యేలా ఈ సిస్టమ్ రూపొందించింది. అయితే ఈ సిస్టమ్ రూ.5 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెక్కులకు వర్తిస్తుంది.
రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్లియరింగ్ జరగాలంటే బ్యాంకులు తప్పనిసరి ఖాతాదారుడికి సమాచారం అందిస్తాయి. పాజిటివ్ పే సిస్టమ్ పట్ల కస్టమర్లకు తగిన అవగాహన కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఎస్ఎంఎస్ హెచ్చరికల ద్వారా, బ్రాంచ్లు, ఏటీఎంలతో పాటు వెబ్సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పాజిటివ్ పే సిస్టమ్ గురించి కస్టమర్లకు తెలియజేయాల్సిందిగా ఆదేశించింది.
పాజిటివ్ పే సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు:
జనవరి 01, 2021 నుంచి అమలులోకి వచ్చిన పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం భారీ చెక్కుల కీలక వివరాలను తిరిగి నిర్ధారించే ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియలో, చెక్కు జారీచేసేవారు ఎలక్ట్రానిక్ రూపంలో, SMS, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM మొదలైన వాటి ద్వారా ఆ చెక్కు నిర్దిష్ట కనీస వివరాలు చెప్పాలి. తేదీ, లబ్ధిదారుడి పేరు / చెల్లింపుదారుడి పేరు, డబ్బు మొత్తం మొదలైనవి బ్యాంకులకు తెలియజేయాలి. అప్పుడు CTS ద్వారా చెక్కుతో వివరాలను క్రాస్ చెక్ చేస్తారు.
అన్ని వివరాలు పర్ఫెక్ట్ గా ఉంటే బ్యాంకు అధికారులు చెక్కు క్లియర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇచ్చిన వివరాలు మ్యాచ్ కాకపోతే.. ఆ చెక్ క్లియర్ అవ్వదు. CTS ద్వారా ఏదైనా అవకతవకలు గుర్తిస్తే బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) CTS లో పాజిటివ్ పే సదుపాయాన్ని అభివృద్ధి చేసి.. సంబంధిత బ్యాంకులకు అందుబాటులోకి తేనుంది. సూచనలకు లోబడి ఉన్న చెక్కులను మాత్రమే CTS మెషిన్ అంగీకరిస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.