నేడు బ్యాంకుల సమ్మె.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఒక్క రోజు సమ్మెకు దిగనున్నారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ)కు చెందిన 3.50 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.

news18-telugu
Updated: October 22, 2019, 7:06 AM IST
నేడు బ్యాంకుల సమ్మె.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు..
బ్యాంకులో కస్టమర్లు (ఫైల్ ఫొటో)
  • Share this:
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం ఒక్క రోజు సమ్మెకు దిగనున్నారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ)కు చెందిన 3.50 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. బ్యాంకుల విలీనం, బ్యాంకింగ్‌ సంస్కరణలు, వినియోగదారులకు విధిస్తున్న అధిక జరిమానాలు, సేవా ఛార్జిలను వ్యతిరేకించేందుకే సమ్మెకు పిలుపునిచ్చామని ఆ సంఘాలు తెలిపాయి. దీంతో తమ బ్యాంకుల కార్యకలాపాలు ప్రభావితం అవుతాయని ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదితర బ్యాంకులు పేర్కొన్నాయి. కాగా, బ్యాంకుల విలీనం ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల సంఖ్య 27 నుంచి 12కి తగ్గనుంది.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సమ్మెలో పాల్గొనడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌బీఐలో పాక్షికంగా సమ్మె ప్రభావం పడనుంది. అంతేకాదు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, కార్పోరేషన్ బ్యాంకులు కూడా సమ్మెలో పాల్గొనడం లేదు.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>