HOME »NEWS »BUSINESS »banking news hdfc bank top among 100 bfsi firms google pay no1 in upi payments sk gh

Banking Services: ఈ ఏడాది బ్యాంకింగ్ సేవల్లో నెంబర్ వన్ ఏదో తెలుసా..?

Banking Services: ఈ ఏడాది బ్యాంకింగ్ సేవల్లో నెంబర్ వన్ ఏదో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం

బ్యాంకింగ్ చెల్లింపుల విభాగంలో, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అగ్రస్థాయిలో నిలిచింది. ఆ తరువాత పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్లు నిలిచాయి.

  • Share this:
దేశంలోని 100 బిఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) కంపెనీ రుణదాతల్లో కెల్లా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్ సర్వీస్, మానిటరీ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ ఆఫరింగ్స్ అందించడంలో భాగంగా విజికి(Wizikey's) రూపొందించిన మూవర్స్ అండ్ షేకర్స్ 2020 నివేదిక(Movers and Shakers report)లో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.'సమ్మర్ ట్రీట్'లను ప్రారంభించడం, నోకాస్ట్ EMI ఆప్షన్లను అందించడం, పెద్ద ఉపకరణాలను కూడా ఎటువంటి డౌన్‌ పేమెంట్ లేకుండానే కొనుగోలుకు అవకాశం ఇవ్వడం వంటి వివిధ ఉత్తమ సర్వీసులు బీఎఫ్ఎస్ఐ(BFSI) సెగ్మెంట్లో టాప్ బ్యాంక్‌గా హెచ్‌డిఎఫ్‌సి నిలవడానికి ప్రధాన కారణాలని నివేదిక స్పష్టం చేసింది.

HDFC తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లు వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో హెచ్‌డిఎఫ్‌సి(HDFC), ఐసిఐసిఐ(ICICI), ఎస్‌బిఐ(SBI), యెస్ బ్యాంక్(Yes Bank), పిఎన్‌బి(PNB), హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్(HSBC Bank), కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాయిష్ బ్యాంక్, ఐడిబిఐ(IDBI) బ్యాంకులు చోటుదక్కించుకొని టాప్ 10 రుణదాతలుగా నిలిచాయి. అయితే, ఈ జాబితాలో యస్ బ్యాంక్ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఈ బ్యాంక్ ఇటీవలే పేలవమైన పనితీరు, నిర్వహణ, మేనేజ్మెంట్ మార్పుతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఏడాది చివరిలో యస్ బ్యాంక్ అనూహ్య వృద్ధి సాధించి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. అదేవిధంగా, కరోనా(Corona) సమయంలో అమలు చేసిన మారిటోరియం నిబంధనలు, కొత్త రుణ విధానం, డిస్కౌంట్లు, క్రెడిట్ కార్డులపై ఆఫర్‌ల పరంగా చూస్తే ఈ ఏడాది కస్టమర్లు అత్యంత ఇష్టపడిన బ్యాంక్గా ఐసిఐసిఐ బ్యాంక్ నిలిచింది. రైతు రుణాలను అంచనా వేయడానికి శాటిలైట్ డేటాను ఉపయోగించిన మొట్టమొదటి బ్యాంక్‌గా కూడా ఐసిఐసిఐ బ్యాంకు రికార్డు సృష్టించింది.



యూపిఐ చెల్లింపుల్లో టాప్‌లో గూగుల్ పే..

2020లో కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో యూపీఐ, వాలెట్ చెల్లింపులు పుంజుకున్నాయి. యుపిఐ డిజిటల్ చెల్లింపుల విభాగంలో, గూగుల్ పే (Google Pay)మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రోండో స్థానంలో ఫోన్పే(Phone Pe) నిలిచింది. కాగా, పేటీఎం(Paytm) మూడో స్థానం, అమెజాన్ పే(Amazon Pay) నాలుగో స్థానాలను దక్కించుకున్నాయి. కాగా, పాపులర్ ఛాటింగ్ ప్లాట్ఫార్మ్ వాట్సాప్ ఇటీవలే పేమెంట్ సర్వీసెస్ను ప్రారంభించినప్పటికీ ఈ విభాగలో ఇతర పేమెంట్స్ సర్వీసులతో పోలిస్తే వెనుకబడే ఉంది. డిజిటలైజేషన్లో భాగంగా దాదాపు అన్ని బ్యాంకులు ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లలో సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ విభాగంలో యోనో (YONO)మొదటి స్థానంలో నిలవగా, నియో, కోటక్ 811 వరుసగా 2, 3 ర్యాంకులను దక్కించుకున్నాయి.

కాగా, బ్యాంకింగ్ చెల్లింపుల విభాగంలో, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అగ్రస్థాయిలో నిలిచింది. ఆ తరువాత పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్లు నిలిచాయి. బిఎఫ్‌ఎస్‌ఐ మూవర్స్ అండ్ షేకర్స్ నివేదికపై విజికి సిఈఓ, సహ వ్యవస్థాపకుడు అన్షుల్ సుశీల్(Anshul Sushil) మాట్లాడుతూ, "మన ఆర్థిక వ్యవస్థ మూలస్తంభాలలో ఒకటైన బిఎఫ్‌ఎస్‌ఐ విభాగం 2020లో కరోనా మూలంగా అతి పెద్ద నష్టాలను చూసింది. బ్యాంకింగ్ రంగం అనేక ప్రతికూలను ఎదుర్కొంది. ఇది బ్యాంకింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలకు దారి తీసింది." అని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్ విశ్లేషణలతో BFSI మూవర్స్ అండ్ షేకర్స్–2020 నివేదికను రూపొందించారు.
Published by:Shiva Kumar Addula
First published:December 24, 2020, 13:11 IST

टॉप स्टोरीज