Home /News /business /

BANK UNIONS CALL FOR TWO DAY NATIONWIDE BANK STRIKE ON DEC 16 17 SK GH

Banks Strike: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎప్పుడు? ఎన్ని రోజులు? డిమాండ్లు ఏంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Banks Strike: ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లోనే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఇంకా చదవండి ...
కేంద్ర ప్రభుత్వం మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటైజేషన్ (Banks Privatization)  చేయనుందనే వార్తల నేపథ్యంలో.. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU). కేంద్రం ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 16-17 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఇప్పటికే IBAతో పాటు ప్రభుత్వానికి కూడా సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) జనరల్ సెక్రటరీ CH వెంకటాచలం.

ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament winter sessions) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లోనే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ బిల్లు అధికారికంగా కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. దీని గురించి క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Interest Rates: ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువ... రూ.1,00,000 దాచుకుంటే ఎంత వస్తుందంటే

UFBU సంస్థ తొమ్మిది బ్యాంకు యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను యూఎఫ్‌బీయూ ముందు నుంచి వ్యతిరేకిస్తోంది. మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. 2021 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని UFBU మార్చి 15-16 వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు సైతం ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు.

Amazon Ganja Case: అమెజాన్‌లో గంజాయి అమ్మకాలను బయటపెట్టిన పోలీస్‌పై బదిలీ వేటు

కొత్త బిల్లు వార్తల నేపథ్యంలో UFBU ప్రతినిధులు నవంబర్ 29-30 తేదీల్లో సమావేశమయ్యారు. డిసెంబర్ 4 వరకు అన్ని రాష్ట్రాల రాజధానులలో ధర్నాలతో సహా ఆందోళనలను ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన రోజున పార్లమెంటు ముందు ఆందోళన కార్యక్రమం చేపడతామని వెంకటాచలం చెప్పారు. ఈ విషయంపై డిసెంబర్ 14న ప్రధానికి ఆన్‌లైన్ పిటిషన్‌ను సమర్పించాలని యూఎఫ్‌బీయూ యోచిస్తోంది.

Earn Rs 10 Crore: మీకు 50 ఏళ్లు వచ్చేసరికి రూ.10 కోట్లు కావాలంటే ఇలా

బ్యాంకుల ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోకుంటే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నారు AIBOC ప్రధాన కార్యదర్శి సంజయ్ దాస్. PSBలను ప్రైవేటీకరిస్తే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాధాన్యత రంగాలపై ప్రభావం పడుతుందని సంజయ్ తెలిపారు. స్వయం సహాయక బృందాలకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రుణాలు అందించే ప్రక్రియ సైతం దెబ్బతింటుందని చెప్పారు. దేశంలోని మొత్తం డిపాజిట్లలో 70 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఉన్నాయని సంజయ్ తెలిపారు. అలాంటి బ్యాంకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెడితే, డిపాజిట్ చేసిన సామాన్యుల నిధులు ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Banks, Banks Privatization, Banks strike

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు