జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీతోపాటు మార్చి 11, 12, 13 తేదీలలో సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు సంఘాలు ఈ నోటీసులో ప్రకటించాయి.

news18-telugu
Updated: January 16, 2020, 1:31 PM IST
జనవరి 31 నుంచి రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు గురువారం పిలుపునిచ్చాయి. వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)తో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘ ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు మార్చి నెలలో సైతం మూడు రోజులు సమ్మె చేస్తామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. వేతన సవరణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాబోయే మూడు నెలల వ్యవధిలో సమ్మెను ఉధృతం చేయాలని తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ నిర్ణయించింది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఒక నోట్ విడుదల చేసింది. జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీతోపాటు మార్చి 11, 12, 13 తేదీలలో సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు సంఘాలు ఈ నోటీసులో ప్రకటించాయి.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>