SBI Share Price | మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ట్రెండ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల స్టాక్స్‌లోనే ఉంది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రభుత్వ రంగానికే చెందిన మరో అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) షేర్లు దుమ్మురేపుతున్నాయి.
ఈ దిగ్గజ బ్యాంకులు శనివారం రోజున అదిరిపోయే త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వీటి ఫలితాలు దాటాయి. రుణాల్లో బలమైన పెరుగుదల, మెరుగైన ఆస్తుల నిర్వహణ, నికర వడ్డీ మార్జిన్లలో మెరుగుదల వంటివి ఈ రెండు బ్యాంకుల ఆర్థిక ఫలితాల్లో కనిపించాయి. లోన్ గ్రోత్ అలాగే కొనసాగే అవకాశం ఉందని ఇరు బ్యాంకులు పేర్కొన్నాయి.
మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. కొత్త కారు కొనే వారికి పండగే!
బ్రోకరేజ్ సంస్థలు ఈ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజాగా ఎస్బీఐ స్టాక్ టార్గెట్ ధరను పెంచేసింది. ఇదివరకు స్టాక్ ధర రూ. 673కు చేరుతుందని అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఈ టార్గెట్ ధరను రూ. 805కు పెంచేసింది. అంటే 30 శాంత మేర ర్యాలీ చేస్తుందని పేర్కొంటోంది.
రూ.30 లక్షలు అందించే అద్భుతమైన పాలసీ.. నెలకు రూ.500 నుంచి కట్టొచ్చు, ఒక్క ప్లాన్‌తో 3 లాభాలు!
మరోవైపు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అయితే ఎస్బీఐ షేరు ధర రూ.700కు చేరొచ్చని పేర్కొంటోంది. జేఎం, ఎల్కేపీ వంటి సంస్థలు అయితే ఎస్బీఐ స్టాక్ ప్రైస్ రూ. 718 వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 613కు చేరింది. ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత షేరు ధర ఏకంగా 5 శాతం ర్యాలీ చేసిన విషయం తెలిసిందే.
బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు ధర రూ. 158 వద్ద ఉంది. వచ్చే ఏడాది కాలంలో షేరు ధర రూ.210 వరకు చేరొచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ రెండు షేర్లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకిన విషయం తెలిసిందే. గత నెల రోజుల కాలంలో చూస్తే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 17 శాతం వరకు ర్యాలీ చేశాయి. ఇదేసమయంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం 6.6 శాతం మాత్రమే పెరిగింది. అంటే ఈ స్టాక్స్ బెంచ్‌మార్క్ కన్నా అధికంగా ర్యాలీ చేశాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మార్కెట్లో డబ్బులు పెట్టడానికి ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of Baroda, Bob, Multibagger stock, Sbi, Share Market Update, State bank of india, Stock Market