KYC : అవసరాలకు పోగా మిగిలిన సొమ్మును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలని అందరూ భావిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్(Mutual funds)ను బెస్ట్ ఆప్షన్‌గా సెలక్ట్ చేసుకుంటున్నారు. వివిధ బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలు, ఇతర కంపెనీలు మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లను లాంచ్ చేస్తుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కొన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసి KYC పూర్తి చేయడానికి వారి అడ్రెస్‌తో కూడిన పూర్తి వివరాలు అందించాలి. కానీ ఇప్పుడు KYC ప్రాసెస్ కోసం బ్యాంకు స్టేట్‌మెంట్ కానీ బ్యాంకు పాస్ బుక్ కానీ అడ్రెస్ ప్రూఫ్‌గా తీసుకోవడం లేదు.
నో యువర్ కస్టమర్ (KYC)
KYC అంటే నో యువర్ కస్టమర్. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌లో గానీ, బ్యాంకులకు సంబంధించి కానీ తమ కస్టమర్లకి సంబంధించి పూర్తి వివరాలు పొందుపరిచే పద్ధతినే కేవైసీ అంటారు. వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులు ఇప్పుడు నో యువర్ కస్టమర్ (KYC) ప్రక్రియను పూర్తి చేయడానికి గుర్తింపు లేదా చెల్లుబాటు అయ్యే ప్రూఫ్ లేదా అడ్రెస్ ప్రూఫ్‌గా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను, పాస్‌బుక్‌లను ఇకమీదట ఉపయోగించలేరు. 2023 జనవరి నుంచి NRIలతో సహా వ్యక్తిగత పెట్టుబడిదారుల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, పాస్‌బుక్ కాపీలను అంగీకరించబోమని KYC రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు (KRA) స్పష్టం చేశాయి. అయినప్పటికీ వ్యక్తిగత ఇతర పెట్టుబడిదారులు, హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ (HUF) కోసం చెల్లుబాటు అయ్యే KYC రుజువుగా కనీసం రెండు నెలల పాటు నమోదులతో కూడిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు లేదా పాస్‌బుక్ కాపీలను తాము అంగీకరిస్తూనే ఉన్నామని KRAలు తెలిపాయి. 2022 నవంబర్ నుంచి KRAలు ఆధార్ కాపీలను అంగీకరించడం కూడా ఆపివేసాయి. వారు e-Aadhaar లేదా Aadhaar XML లేదా వర్చువల్ ID (VID)ని సమర్పించమని పెట్టుబడిదారులను అడుగుతున్నారు.
ఇప్పుడు ఏ డాక్యుమెంట్లను KYCకి ఉపయోగించవచ్చు?
బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌బుక్‌లకు బదులుగా పెట్టుబడిదారులు పాస్‌పోర్ట్‌లు, ఓటర్ ఐడీలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, NREGA జాబ్ కార్డ్‌లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లెటర్‌లు ఉపయోగించవచ్చు. ఆధార్‌ను కలిగి ఉన్నట్లు ప్రూఫ్‌ను ఇతర అనుమతించదగిన డాక్యుమెంట్‌లను అందజేయాలి.
GST Summons: జీఎస్టీ సమన్లు అంటే ఏంటి? వీటికి ఎలా స్పందించాలి? పూర్తి నిబంధనలు ఇవే..
మ్యూచువల్ ఫండ్ KYC అంటే ఏంటి?
ఆర్థిక సేవలను అందించే ఏదైనా మ్యూచువల్ ఫండ్ హౌస్ లేదా కంపెనీ తన కస్టమర్‌లపై బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా మనీలాండరింగ్, మోసం నేర కార్యకలాపాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చేయడంలో KYC సహాయపడుతుంది. స్టాండర్డ్ అకౌంట్ ఓపెనింగ్ ఫారం (AOF) సాధారణంగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ 1లో సెంట్రల్ KYC రిజిస్ట్రీ (యూనిఫాం KYC) సూచించిన విధంగా పెట్టుబడిదారుడి ప్రాథమిక KYC వివరాలు ఉంటాయి. దీనిని రిజిస్టర్ అయిన అన్ని ఆర్థిక మధ్యవర్తులు ఉపయోగిస్తారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా (AMFI) ప్రకారం పార్ట్ IIలో అదనపు KYC సమాచారాన్ని మ్యూచువల్ ఫండ్, స్టాక్ బ్రోకర్ లేదా పెట్టుబడిదారుడి అకౌంట్ ఓపెన్ చేసే డిపాజిటరీ పార్టిసిపెంట్ వంటి ఆర్థిక మధ్యవర్తి ద్వారా విడిగా కోరే అవకాశం ఉంది.
తప్పని సరిగా మ్యూచువల్ ఫండ్ KYC కావాలా?
అవును మ్యూచువల్ ఫండ్ KYC తప్పనిసరి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (2002) ప్రకారం మ్యూచువల్ ఫండ్ KYC చెక్ ప్రక్రియ అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా 2002 సంవత్సరంలో KYC మార్గదర్శకాలు అందించింది. మనీలాండరింగ్ నిరోధక ప్రమాణాలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్‌తో ఇదే విషయాన్ని దాని అవసరాన్ని మళ్లీ నొక్కి చెప్పింది.
ఆన్‌లైన్‌లో ఎలా చేయాలి?
దీన్ని ఆన్‌లైన్‌లో చేయాలనుకునే పెట్టుబడిదారులు, ఫండ్ లేదా KRA వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వారి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు KYC ఫారంలో అన్ని వివరాలను నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను సెల్ఫ్- అటెస్టెడ్ కాపీలను ఫారంతో అప్‌లోడ్ చేయలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, KYC submissionsn, Mutual Funds