Bank Fraud | బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. బ్యాంక్ ఖాతా కలిగిన వారు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ కస్టమర్లను మోసగాళ్లు బురిడీ కొట్టిస్తూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్ (Bank Accout) నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. అందువల్ల బ్యాంక్ (Bank) ఖాతాదారులు ఏమరపాటుగా ఉంటే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
గురుగ్రామ్‌లో తాజాగా ఒక సంఘటన చోటుచేకుంది. ఒక మహిళ ఏకంగా రూ. లక్ష పోగొట్టుకుంది. ఎలా అంటే బ్యాంక్ ఎస్ఎంఎస్ స్కామ్ ఇందుకు కారణం. మోసగాళ్లు బ్యాంక్ కస్టమర్లకు మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తూ ఉంటారు. వీటిల్లో లింక్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే అంతే.. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మాయం అవుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పని చేయడం లేదని, వెంటనే కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని మోసగాళ్లు బ్యాంక్ కస్టమర్లకు ఎస్ఎంఎస్ పంపిస్తూ ఉంటారు.
ఎస్‌బీఐ కొత్త ఆఫర్ అదిరింది.. లోన్ తీసుకునే వారికి సూపర్ బెనిఫిట్స్!
ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కంగారు పడపోయి బ్యాంక్ వివరాలను ఎంటర్ చేస్తే.. ఆ సమాచారంతో మోసగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. ఎస్ఎంఎస్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే.. బ్యాంక్ వెబ్‌సైట్ మాదిరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. వివరాలు ఎంటర్ చేస్తే.. అంతే సంగతి. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.
ఓలా ఎలక్ట్రిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్.. ఏడాదికి రూ.1999 కడితే చాలు..
ఒకవేళ మీకు తెలియకుండా ఇలాంటి మోసాల బారిన పడితే వెంటనే బ్యాంక్ అధికారలుకు కాల్ చేసి వివరాలు తెలియజేయండి. అలాగే దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేస్తే మంచిది. ఆలస్యం మాత్రం చేయకూడదు. ఆలస్యం చేస్తే.. డబ్బులు తిరిగి వెనక్కి పొందటం కష్టతరం అవుతుంది. వెంటనే స్పందిస్తే.. డబ్బులు తిరిగి వెనక్కి పొందే అవకాశం ఉంటుంది.
9429663283 అనే నెంబర్ నుంచి మీకు మెసేజ్ వస్తే మాత్రం అస్సలు స్పందించవద్దు. ఎస్ఎంఎస్‌లో ఉన్న లింక్‌పై క్లిక్ చేయవద్దు. లేదంటే మాత్రం మోసపోవాల్సి వస్తుంది. మీ బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఈరోజుతో మీ బ్యాంక్ అకౌంట్ పని చేయదని, కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని మెసేజ్ వస్తుంది. కంగారు పడాల్సిన పని లేదు. ఇది మోసపూరిత మెసేజ్. నమ్మి వివరాలు ఎంటర్ చేస్తే మాత్రం అసలుకే ముప్పు వస్తుంది. డబ్బులు పోగొట్టుకోవాలి. అందుకే ఈ నెంబర్‌తో జాగ్రత్తగా ఉండండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank account, Bank fraud, Bank news, Banks, HDFC bank, Icici bank, Sbi