Bank News | బ్యాంకుల పెద్దన్నగా చెప్పుకునే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచుకుంటూనే వస్తోంది. ఈక్రమంలో బ్యాంకులు కూడా వరుస పెట్టి రుణ రేట్లు పెంచేస్తున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు రుణ రేట్లు పెంచేశాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) వంటివి కూడా రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో మరో బ్యాంక్ కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరింది.
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కూడా రుణ రేట్లు పెంచేసింది. దీంతో కొత్త ఏడాదిలో హోమ్ లోన్, కార్ లోన్ , పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. రుణ రేట్లు పెరగడం వల్ల లోన్ తీసుకోవాలని భావించే వారు రానున్న కాలంలో అధిక వడ్డీ రేటు చెల్లించుకోవాల్సి వస్తుంది. అదేసమయంలో బ్యాంక్ నుంచి ఇప్పటికే లోన్ తీసుకొని ఉంటే.. వారి నెల వారీ ఈఎంఐ పైపైకి చేరనుంది.
ధర రూ.3 మాత్రమే.. లాభం రూ.20 లక్షలు.. నికార్సైన మల్టీబ్యాగర్ ఇదే!
బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రేటును పెంచింది. ఇప్పటికే రేట్ల పెంపు అమలులోకి వచ్చింది. బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.9 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. బ్యాంక్ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది.
ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపు.. రూ.19 వేల డిస్కౌంట్ పొందండి!
బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఎంసీఎల్ఆర్ రేట్లను గమనిస్తే.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.3 శాతం నుంచి 7.5 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతం నుంచి 7.7 శాతానికి ఎగసింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.6 శాతం నుంచి 7.9 శాతానికి చేరింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.7 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.2 శాతానికి ఎగసింది. కాగా బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర క్యూ2 సెప్టెంబర్ త్రైమాసికంలో అదిరిపోయే పనితీరు కనబర్చింది. రూ. 535 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఏడాది కిందట బ్యాంక్ నికర లాభం రూ. 264 కోట్లుగా ఉంది. అంటే బ్యాంక్ నికర లాభం ఏకంగా 103 శాతం మేర పైకి చేరింది. అలాగే బ్యాంక్ మొత్తం ఆదాయం వార్షికంగా 7 శాతం పైకి ఎగసింది. రూ. 4317 కోట్లుగా నమోదు అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.