Loan EMI | రెండు బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీంతో బ్యాంక్ (Bank) కస్టమర్లపై ప్రభావం పడనుంది. బ్యాంక్ నుంచి లోన్ (Loan) తీసుకున్న వారిపై ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకోవాలని భావించే వారిపై కూడా ప్రతికూల ప్రబావం పడొచ్చు. ఎందుకంటే ఈ రెండు బ్యాంకులు తాజాగా ఎంసీఎల్ఆర్ (MCLR) రేటును పెంచేశాయి.
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 20 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. అక్టోబర్ 10 నుంచి ఈ రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి వచ్చింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.8 శాతానికి చేరింది. ఇది వరకు 7.6 శాతంగా ఉండేది.
బంగారం, వెండి కొనాలనుకునే వారికి అదిరే గుడ్ న్యూస్.. ఏకంగా రూ.1,400 పడిపోయిన ధరలు!
అలాగే ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ బేస్ రేటు 9.5 శాతానికి చేరింది. అక్టోబర్ 8 నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటు కన్నా తక్కువ రేటుకు రుణాలు అందించవు. దీన్ని కనీస రుణ రేటుగా చెప్పుకుంటారు.
కారు కొంటే రూ.లక్ష తగ్గింపు.. కంపెనీ బంపరాఫర్!
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత కొంత కాలంగా కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూ వస్తోంది. రెపో రేటును పెంచుతోంది. ఇటీవల కూడా రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో రెపో రేటు 5.9 శాతానికి చేరింది. దీంతో బ్యాంకులు కూడా వరుస పెట్టి రుణ రేట్లు పెంచుకంటూ వస్తున్నాయి. రేట్ల పెంపు వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
బ్యాంకుల లోన్ రీసెట్ డేట్ తర్వాత రుణాలపై వడ్డీ రేటు పెరుగుతుంది. దీంతో నెలవారీ ఈఎంఐ పైకి చేరుతుంది. లేదంటే లోన్ టెన్యూర్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎంసీఎల్ఆర్ రేటు ప్రాతిపదికన రుణాలు పొందిన వారికే ఇది వర్తిస్తుందని గుర్తించుకోవాలి. కాగా కెనరా బ్యాంక్ కూడా ఇటీవలనే రుణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ బ్యాంక్ కస్టమర్లపై కూడా ప్రభావం పడనుంది. కాగా రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఆర్‌బీఐ మళ్లీ రెపో రేటు పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులు కూడా రుణ రేట్లు పెంచుకుంటూ వెళ్తాయి. దీంతో రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of Maharashtra, Banks, Home loan, IDFC FIRST Bank, Mclr