EMI | బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఉగాది శుభవార్త ముందే అందింది. ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. హోమ్ లోన్స్‌పై (Home Loan) వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ (Bank) వెల్లడించింది. దీంతో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. దీంతో పరిశ్రమలో తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందించే బ్యాంకుల జాబితాలో ఈ బ్యాంక్ కూడా చేరింది.
పుణే కేంద్రంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్న ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు తగ్గించడం వల్ల రెండో బ్యాంక్‌గా నిలిచింది. ఇటీవల కాలంలో కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గించింది. తర్వాత మళ్లీ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర హోమ్ లోన్స్‌పై రుణ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.
రూ.3,300 పతనమైన బంగారం, వెండి ధరలు.. ఆనందపడేలోపే..
అయితే ఈ తక్కువ వడ్డీ రేటు బెనిఫిట్ కొందరికే వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. అంటే క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి తక్కువ వడ్డీ రేటుకు రుణాలు లభిస్తాయి. అందువల్ల మీకు క్రెడిట్ స్కోర్ బాగుంటే.. అప్పుడు మీకు కూడా చౌక వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ లభిస్తాయని చెప్పుకోవచ్చు. కాగా ఇది వరకే హోమ్ లోన్స్‌పై, గోల్డ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ కల్పించినట్లు బ్యాంక్ తెలిపింది.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనండి.. ఉచితంగా థాయ్‌లాండ్ చుట్టేసిరండి, కంపెనీ భారీ ఆఫర్!
ఇకపోతే దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ)లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ వడ్డీ రేటు కన్నా బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ఇంకా తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్‌కు ఆఫర్ చేయడం గమనార్హం.
అందువల్ల మీరు ఇప్పుడు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తే.. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర నుంచి హోమ్ లోన్ తీసుకోవడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాగా హోమ్ లోన్ తీసుకునే ముందు బ్యాంక్ చార్జీల గురించి కూడా తెలుసుకోవాలి. ఏ ఏ చార్జీలు ఉన్నాయి? ఎంత వసూలు చేస్తుంది? వంటి అంశాలను కూడా నిశితంగా గమనించాలి. లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. హోమ్ లోన్స్ పెద్ద మొత్తంతో కూడుకున్నవి. అందువల్ల వడ్డీ రేటు కొంచం తగ్గినా కూడా దీర్ఘకాలంలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loan, Bank of Maharashtra, Banks, Home loans, Interest rates