హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Offer: శుభవార్త.. దీపావళి ముందు ఈ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్!

Bank Offer: శుభవార్త.. దీపావళి ముందు ఈ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్!

 Bank Offer: శుభవార్త.. దీపావళి ముందు ఈ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్!

Bank Offer: శుభవార్త.. దీపావళి ముందు ఈ బ్యాంక్ కస్టమర్లకు అదిరిపోయే గిఫ్ట్!

Home Loan Interest Rate | పర్సనల్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? లేదంటే హోమ్ లోన్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకని అనుకుంటున్నారా? తాజాగా ఒక బ్యాంక్ ఈ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Personal Loan | దీపావళి పండుగ వచ్చేస్తోంది. పండుగ సీజన్‌లో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? లేదంటే పర్సనల్ లోన్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకు తీపికబురు. ఎందుకని అనుకుంటున్నారా. తాజాగా ఒక బ్యాంక్ హోమ్ లోన్స్‌పై (Home Loan), పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని బ్యాంకులు రుణ రేట్లు పెంచుకుంటూ వెళ్తుంటే.. ఈ బ్యాంక్ మాత్రం రివర్స్ గేర్‌లో హౌసింగ్ రుణాలు (Housing Loan), ఇతర లోన్స్‌పై వడ్డీ రేటును తగ్గించింది. దీంతో హోమ్ లోన్, వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర తాజాగా హౌసింగ్ లోన్స్‌పై వడ్డీ రేటును తగ్గించింది. దీంతో బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8 శాతానికి దిగి వచ్చింది. బ్యాంక్ ఇదివరకు హోమ్ లోన్స్‌పై 8.3 శాతం వడ్డీని వసూలు చేసేది. అయితే హోమ్ లోన్ వడ్డీ రేటు అనేది రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది.

మారనున్న బ్యాంకుల పనివేళలు.. ఇకపై ముందుగానే తెరచుకోనున్న బ్రాంచులు!

కేవలం హోమ్ లోన్స్‌పై మాత్రమే కాకుండా పర్సనల్ లోన్స్‌పై కూడా వడ్డీ రేటును తగ్గించింది. బ్యాంక్ ఇది వరకు పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 11.35 శాతం నుంచి వసూలు చేసేది. అయితే ఇప్పుడు బ్యాంక్ నుంచి కస్టమర్లు 8.9 శాతం ప్రారంభ వడ్డీతో పర్సనల్ లోన్స్ పొందొచ్చు. అక్టోబర్ 17 నుంచి ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి.

బ్యాంక్‌కు వెళ్లకుండానే 20కి పైగా సర్వీసులు పొందండి.. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లతో లాభాలెన్నో!

బ్యాంక్ ఇప్పటికే హోమ్ లోన్స్, కార్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది. దీపావళి ధమాకా ఆఫర్ కింద ఈ మినహాయింపు అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర ప్రత్యేకించి హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్‌పై చాలా తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తోందని చెప్పుకోవచ్చు. పండుగ సీజన్‌లో కస్టమర్లకు ఆకర్షించేందుకు బ్యాంక్ ఈ మేరకు రుణ రేట్లు తగ్గించిందని చెప్పుకోవచ్చు. కాగా దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలకమైన రెపో రేటు పెంచడం వల్ల బ్యాంకులు వరుసపెట్టి రుణాలపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఆర్‌బీఐ గత ఐదు నెలలుగా రెపో రేటును పెంచుకుంటూనే వస్తోంది. దీంతో రుణ రేట్లు కూడా పెరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ బ్యాంక్ మాత్రం రుణ రేట్లు తగ్గించేసింది.

First published:

Tags: Bank, Bank of Maharashtra, Home loan, Personal Loan, Rbi

ఉత్తమ కథలు