హోమ్ /వార్తలు /బిజినెస్ /

Banks Privatization: ఆ నాలుగు బ్యాంకులు ప్రైవేటు పరం.. సంచలన నిర్ణయం దిశగా మోదీ సర్కార్

Banks Privatization: ఆ నాలుగు బ్యాంకులు ప్రైవేటు పరం.. సంచలన నిర్ణయం దిశగా మోదీ సర్కార్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరో నాలుగు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని మోదీ సర్కార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ లీస్టులో బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర(Bank of Maharashtra), బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(Bank of India), ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​(Indian Overseas Bank), సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(Central Bank of India) ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  మరో నాలుగు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేయాలని మోదీ సర్కార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ లీస్టులో బ్యాంక్​ ఆఫ్​ మహారాష్ట్ర, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఉన్నట్లు తెలుస్తోంది. 2021–2022 ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ ఏప్రిల్ లో స్టార్ట్ అవనుంది. సెంట్రల్​ బ్యాంక్ లాంటి మధ్య తరహా బ్యాంకుల ప్రైవటైజేషన్ సక్సెస్ అయితే​ పెద్ద బ్యాంకులను సైతం ప్రైవేట్ పరం చేస్తారని తెలుస్తోంది. అయితే.. స్టేట్​ బ్యాంకులో మాత్రం మెజారిటీ వాటా ప్రభుత్వం దగ్గరే ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక పథకాలు ఈ బ్యాంక్ ద్వారానే నడుస్తుండడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

  ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులో 33 వేల మంది, బ్యాంక్ ఆఫ్​ ఇండియాలో 50 వేల మంది, ఇండియన్​ ఓవర్సీస్ బ్యాంక్ లో 26 వేల మంది, బ్యాంక్ ఆఫ్​ మహారాష్ట్రలో 13 వేల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ ప్రైవేటైజేషన్​ ప్రక్రియను వారంతా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాల నుంచి సైతం ఈ అంశంపై తీవ్రంగా ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

  అయితే ప్రభుత్వం మాత్రం బ్యాంకులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవటేజేషన్ పై స్పష్టమైన విధానంతో ఉంది. ఎలాగైనా ప్రైవటైజేషన్ ప్రక్రియపై వెనక్కు తగ్గవద్దన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే ఈ అంశంపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు నిరాకరించడం గమనార్హం. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో సిబ్బంది తక్కువగా  ఉన్నందున ముందుగా ఆ బ్యాంకుతోనే ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bank of India, Bank of Maharashtra, Central Bank of India, Indian Overseas Bank, Pm modi, Private Sector

  ఉత్తమ కథలు