BANK OF INDIA NET BANKING MOBILE BANKING SERVICES DOWN AFTER SYSTEM UPDATE MK GH
Bank of India: నిలిచిపోయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు... ఆ అప్‌గ్రేడ్ తర్వాత సమస్యలు
ప్రతీకాత్మకచిత్రం
ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు జనవరి 21 నుంచి 24 వరకు నిలిచిపోయాయి. దీంతో ఆన్లైన్ సర్వీసులకు (online services) అంతరాయం కలిగింది.
మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లా? గత నాలుగు రోజులుగా ఆన్లైన్ సేవల్లో అనేక సమస్యలను ఎదుర్కొన్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే! ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు జనవరి 21 నుంచి 24 వరకు నిలిచిపోయాయి. దీంతో ఆన్లైన్ సర్వీసులకు (online services) అంతరాయం కలిగింది. ఈ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా అనేక ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని (Online banking services restored) బ్యాంక్ తెలిపింది. దాంతో నాలుగు రోజుల తర్వాత కస్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ వారం ప్రారంభంలో బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ (core banking system upgradation) చేస్తున్నట్లు ట్విట్టర్లో వెల్లడించింది. అయితే, ఈ అప్‌గ్రేడేషన్ ప్రారంభమయ్యాక ఆన్లైన్ సేవలు డౌన్ అయ్యాయని, ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయని ఆరోపిస్తూ కస్టమర్లు ట్విట్టర్లో కంప్లైంట్ చేశారు. విస్తుగొలిపే అంశమేంటంటే, ఈ సమస్య నాలుగు రోజులు పాటు కొనసాగింది. ఈ విషయం తెలిసి కస్టమర్లు నివ్వెరపోతున్నారు. అయితే ఇప్పుడు తన వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తున్నాయని బ్యాంక్ ప్రకటించింది. “అప్‌గ్రేడేషన్ పూర్తయ్యాక RTGS, NEFT, ఇంటర్నెట్ బ్యాంకింగ్ & BOI మొబైల్ సేవలు ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.” అని బ్యాంక్ ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగింది?
తన కోర్ సిస్టమ్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా తన కస్టమర్ల మైగ్రేషన్ ప్రక్రియను జనవరి 21 నుంచి షెడ్యూల్ చేస్తామని జనవరి 23న ట్విటర్ వేదికగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ జనవరి 21 నుంచి 24 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. అయితే జనవరి 21 నుంచి ఆన్లైన్ లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయని వినియోగదారులు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు. నెట్ బ్యాంకింగ్, చెక్ క్లియరెన్స్‌లు, లావాదేవీల వంటి సేవలతో సహా కీలకమైన బ్యాంకింగ్ సేవలను తాము క్యారీ అవుట్ చేయలేకపోతున్నామని పేర్కొంటూ ట్విట్టర్లో ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని గమనించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేస్తూ... మైగ్రేషన్ వివరాలు అప్‌గ్రేడ్ చేస్తున్న సమయంలో చిన్న అవాంతరాల వల్ల సమస్యలు వచ్చాయని తెలిపింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.