హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank e-Auction: బ్యాంక్ బంగారంలాంటి ఆఫర్.. చౌక ధరకే ఫ్లాట్, ఇల్లు, ఇతర ప్రాపర్టీ కొనేయండి!

Bank e-Auction: బ్యాంక్ బంగారంలాంటి ఆఫర్.. చౌక ధరకే ఫ్లాట్, ఇల్లు, ఇతర ప్రాపర్టీ కొనేయండి!

 బ్యాంక్ బంగారంలాంటి ఆఫర్.. చౌక ధరలకే ఫ్లాట్, ఇల్లు, ఇతర ప్రాపర్టీ కొనేయండి!

బ్యాంక్ బంగారంలాంటి ఆఫర్.. చౌక ధరలకే ఫ్లాట్, ఇల్లు, ఇతర ప్రాపర్టీ కొనేయండి!

Bank News | మీరు తక్కువ ధరకే ఇల్లు, ఇతర ప్రాపర్టీ వంటివి కొనుగోలు చేయాలని యోచిస్తూ ఉంటే మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఇవేలం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తక్కువ ధరకే ప్రాపర్టీ కొనొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Bank Auction | మీరు ఇల్లు లేదంటే ఇతర ప్రాపర్టీ వంటివి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో (Banks) ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. మెగా ఇఆక్షన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో పాల్గొని తక్కువ ధరకే ఇల్లు, ప్రాపర్టీ వంటివి కొనుగోలు చేయొచ్చు. ఈ అవకాశం కేవలం డిసెంబర్ 9న మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవేలం ద్వారా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 9న ఇవేలం ఉంటుంది. 1000కి పైగా ప్రాపర్టీలు కొనేందుకు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ వెల్లడించింది. ఆఫీస్ స్పేస్, ఫ్లాట్స్, అపార్ట్‌మెంట్లు, రెసిడెన్షియల్ హౌస్‌లు, వేకెంట్ సైట్స్, కమర్షియల్ షాప్స్, ఇండస్ట్రియల్ ల్యాండ్/ బిల్డింగ్స్ వంటి వాటిని వేలంలో పాల్గొని కొనుగోలు చేయొచ్చు.

బ్యాంక్‌కు వెళ్లకుండా క్షణాల్లో అకౌంట్‌లోకి రూ.8 లక్షలు పొందండి.. ఎస్‌బీఐ బంపరాఫర్!

బెంగళూరు, చెన్నై, ఢిల్లీ , హైదరాబాద్ , కోల్‌కతా, ముంబై వంటి ప్రాంతాల్లో ప్రాపర్టీని కొనొచ్చు. ఔత్సాహికులు ఆన్‌లైన్‌లో ప్రాపర్టీని బిడ్లను దాఖలు చేయొచ్చు. మీరు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవేలంలో పాల్గొనాలని భావిస్తే.. మీరు ఐబీఏపీఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లేదంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ వేలం పూర్తి వివరాలు పొందొచ్చు. లేదంటే మీరు 7506871647, 7506871749 నెంబర్లకు కాల్ చేసి ఈ వేలం వివరాలు తెలుసుకోవచ్చు.

కస్టమర్లకు తీపికబురు అందించిన ప్రైవేట్ బ్యాంక్!

బ్యాంకులు అప్పుడప్పుడు ఇలా వేలం పాటలు నిర్వహిస్తాయి. ఆన్‌లైన్‌లోనే ఇవేలం జరుగుతుంది. ఇందులో పాల్గొని నచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలో మీకు ప్రాపర్టీ లభిస్తుంది. బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని తిరిగా కట్టలేకపోయిన వారి ప్రాపర్టీని బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది. దీన్ని వేలం ద్వారా విక్రయిస్తుంది. అందుకే ఈ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులు కూడా ఇలా వేలం నిర్వహిస్తూ ఉంటాయి.

బ్యాంక్ కస్టమర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీలను వేలం ద్వారా మనం కొనాల్సి ఉంటుంది. అందుకే తక్కువ ధరకే ఇవి లభిస్తాయి. అయితే ఇలాంటి ప్రాపర్టీ కొనడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండవు. బ్యాంకులు మీకు ప్రాపర్టీని విక్రయిస్తాయి. పూర్తి క్లియరెన్స్ బ్యాంక్ నుంచి మీకు లభిస్తుంది. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రాపర్టీ కొనాలని భావించే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Bank, Bank of India, Banks, Money, Property

ఉత్తమ కథలు