RBI | దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్ 7న కీలక పాలసీ రేటును పెంచేసింది. రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంగా ఆర్బీఐ (RBI) ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల బ్యాంకులు (Banks) కూడా రుణ రేట్లు పెంచుతూ వస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మరో బ్యాంక్ దీని సరసన చేరింది. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తాజాగా రుణ రేట్లు పెంచేసింది.
రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటికే ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందని పేర్కొంది. రెపో బెస్డ్ లెండింగ్ రేటు (ఆర్బీఎల్ఆర్) ఇప్పుడు 9.1 శాతానికి చేరిందని బ్యాంక్ తెలిపింది. రెపో రేటు 6.25 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 7 నుంచి ఎఫెక్టివ్ ఆర్బీఎల్ఆర్ 9.1 శాతంగా ఉంటుందని తెలిపింది.
ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క రూపాయి ఆఫర్ అదిరింది!
ఆర్బీఐ రెపో రేటు ప్రాతిపదికన ఈ లెండింగ్ రేటు కూడా మారుతూ ఉంటుంది. 2019 అక్టోబర్ 1 నుంచి ఫ్లోటింగ్ రేటు రిటైల్ లోన్స్ అన్నీ కూడా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటుతో అనుసంధానం అయ్యాయి. అంటే ఆర్బీఐ రెపో రేటుతో లింక్ అవుతాయి. దీని వల్ల ఆర్బీఐ రెపో రేటును సవరిస్తే.. ఆ మార్పు వెంటనే ఈ రెపో లింక్డ్ రుణాలపై కూడా ఉంటుంది.
ఇయర్ ఎండ్ ధమాకా ఆఫర్.. కారు కొంటే రూ.లక్షా 50 వేల డిస్కౌంట్!
ఆర్ఎల్ఎల్ఆర్ రేటు ప్రకారం లోన్ తీసుకుంటే అప్పుడు వడ్డీ రేటు రెపో రేటు ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. రెపో రేటుపెరిగితే రుణ రేట్లు కూడా పెరుగుతాయి. అలాగే రెపో రేటు తగ్గితే రుణ రేట్లు కూడా దిగి వస్తాయి. ఈ రేట్ల మార్పు కూడా వేగంగా ఉంటుంది. దీని వల్ల వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంటోంది. ఇకపోతే బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును గమనిస్తే.. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా ఉంది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ 7.65 శాతంగా కొనసాగుతోంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 7.7 శాతంగా ఉంది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.9 శాతంగా కొనసాగుతోంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.15 శాతంగా, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.35 శాతంగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of India, Banks, Rbi, Reserve Bank of India