కరోనా (Corona) తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు గోల్డ్ లోన్ (gold loan) నుంచి హోం లోన్ (Home loan)వరకు ఇలా ప్రతి లోన్ పై వడ్డీ రేట్లు (interest rates) తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) గృహ (home), వాహన రుణాలు (vehicle loans) తీసుకోవాలనుకుంటున్న వారికి తీపి కబురు (good news) అందించింది. హోం, వెహికల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదివారం ప్రకటించింది. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్ల (interest rates)ను వరుసగా 35 బేసిస్ పాయింట్లు, 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ తగ్గింపు (cutting)తో ఇప్పుడు హోం లోన్ (Home loan)లపై వడ్డీ రేటు 6.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఇంతకు మునుపు గృహ రుణాలపై వడ్డీ రేటు 6.85 శాతంగా ఉండేది. ఇప్పుడది 6.5 శాతానికి తగ్గింది. అలాగే వాహన రుణాలపై వడ్డీ రేటు 7.35 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది.
6.85 శాతానికే వెహికల్ లోన్..
పండగ సీజన్ సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక వడ్డీ రేటు (special interest rate) అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని బ్యాంకు (bank) పేర్కొంది. తగ్గిన వడ్డీ రేటు కొత్తగా రుణాల కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇతర బ్యాంకుల (other banks) నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా (bank of india)కి రుణాలను బదిలీ చేయాలనుకునే వారికి కూడా ఇదే వడ్డీ రేటు (interest rate) అందుబాటులో ఉంటుంది.
read this also: గృహరుణాలు ముందుస్తుగా చెల్లిస్తే లాభమా? నష్టమా? ఖచ్చితంగా తెలుసుకోండి
డిసెంబర్ 31 వరకు..
డిసెంబర్ 31 వరకు గృహ, వాహనాల రుణాలపై ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా వసూలు చేయమని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. మరోవైపు,ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, తదితర బ్యాంకులు పండుగ సీజన్‌లో రుణ గ్రహీతలను ఆకట్టుకునేందుకు వివిధ రకాల రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.50 లక్షల వరకు రుణాలపై వడ్డీ రేటును 6.50 శాతానికి తగ్గించింది. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా దాదాపు ఇదే వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of India, Home loan, Interest rates