Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Loan: లోన్ తీసుకొని కారు కొనే వారికి ఈ బ్యాంక్ బంపరాఫర్లు!

Bank Loan: లోన్ తీసుకొని కారు కొనే వారికి ఈ బ్యాంక్ బంపరాఫర్లు!

 Bank Loan: లోన్ తీసుకొని కారు కొనే వారికి ఈ బ్యాంక్ బంపరాఫర్లు!

Bank Loan: లోన్ తీసుకొని కారు కొనే వారికి ఈ బ్యాంక్ బంపరాఫర్లు!

Car Loan | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మీకోసం పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Vehicle Loan | పండుగ సీజన్ నడుస్తోంది. మీరు కొత్తగా కారు (Car) కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కొత్తగా వెహికల్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పుకోవచ్చు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు స్టార్ వెహికల్ లోన్ స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఈ స్కీమ్ కింద కారు కొనుగోలు చేయాలని భావించే వారికి పలు రకాల ప్రయోజనాలు లభించనున్నాయి. తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. కారు కొనేందుకు లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 8.3 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. పాత కారు లేదా కొత్త కారు దేనికైనాసరే లోన్ తీసుకోవచ్చు.

SBI బంపరాఫర్.. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలుపై భారీ తగ్గింపు!

అంతేకాకుండా బ్యాంక్ మరో బెనిఫిట్ కూడా అందిస్తోంది. లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తోంది. అంటే కారు లోన్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. 2022 డిసెంబర్ 31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇండివీజువల్స్, కార్పొరేట్ సంస్థలు ఈ స్కీమ్ కింద లోన్ పొందొచ్చు. తీసుకున్న రుణానికి ఏకంగా 84 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ టెన్యూర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

బాబోయ్ బంగారం.. వచ్చే దీపావళి కల్లా కొండెక్కనున్న ధర.. ఎంత పెరగొచ్చంటే?

స్టార్ వెహికల్ లోన్ కింద కారు కొనుగోలు చేసిన వారికి ఈఎంఐ కూడా తక్కువగానే ఉంది. రూ.లక్షకు ఈఎంఐ రూ. 1574 నుంచి ప్రారంభం అవుతోంది. దీని వల్ల రుణ గ్రహీతలు తక్కువ ఈఎంఐతో కారును కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేసే వారికి బ్యాంక్ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. కారు ఆన్‌రోడ్ ధరకు సమానమైన మొత్తాన్ని రుణం రూపంలో అందిస్తోంది. టాటా నెక్సన్, టాటా పంచ్, కంపెనీకి చెందిన ఇతర అన్ని రకాల ఎలక్ట్రిక్ వేరియంట్లు, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, ఈ కంపెనీకి చెందిన అన్నీ ఈవీలకు ఈ వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. హోమ్ లోన్స్‌పై కూడా రుణ రేట్లు తగ్గించింది. దీంతో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి కూడా ప్రయోజనం కలుగనుంది. బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు.

First published:

Tags: Bank, Bank loan, Car loans, Money, Personal Finance

ఉత్తమ కథలు