హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.50 లక్షల లోన్ ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా

Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.50 లక్షల లోన్ ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా

Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.50 లక్షల లోన్ ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా
(image: Bank of India)

Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.50 లక్షల లోన్ ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (image: Bank of India)

BOI Star MSME Welcome Offer | బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) 'బీఓఐ స్టార్ ఎంఎస్ఎంఈ వెల్‌కమ్ ఆఫర్' పేరుతో బిజినెస్ లోన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

  వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా? బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) బిజినెస్ లోన్ ఆఫర్ ప్రకటించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) వ్యాపార రుణాలు ఇచ్చేందుకు ఆఫర్ ప్రకటించింది. బీఓఐ స్టార్ ఎంఎస్ఎంఈ వెల్‌కమ్ ఆఫర్ (BOI Star MSME Welcome Offer) పేరుతో భారీగా రుణాలు ఇస్తోంది. రూ.50 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు రుణాలు తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం తగ్గింపు, డాక్యుమెంటేషన్ ఛార్జీలపై 30 శాతం తగ్గింపు కూడా ప్రకటించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఎంఎస్ఎంఈ రుణాలకు అప్లై చేయొచ్చు. ఈ లోన్ ఆఫర్‌కు సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా.

  బీఓఐ స్టార్ ఎంఎస్ఎంఈ వెల్‌కమ్ ఆఫర్ వివరాలివే...


  ప్రస్తుతం వ్యాపారాలు నిర్వహిస్తున్నవారు లేదా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకుంటున్నవారు తమ పెట్టుబడి అవసరాల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాలను అందిస్తోంది. జీఎస్‌టీఐఎన్ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, పరిశ్రమలు ఈ రుణాలు తీసుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తీర్చుకోవడానికి ఈ రుణాలు పొందొచ్చు. కనీసం రూ.50 లక్షల రుణాలు తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.50 కోట్ల వరకు లోన్ లభిస్తుంది. వడ్డీ రేట్ల వివరాలు చూస్తే వార్షికంగా కేవలం 7 శాతం వడ్డీ రేటుతోనే ఈ రుణాలను ఆఫర్ చేస్తోంది బ్యాంక్ ఆఫ్ ఇండియా.

  LIC Policy: ఈ పాలసీలో రోజూ రూ.41 చెల్లిస్తే రూ.63 లక్షల వరకు రిటర్న్స్

  ఈ రుణాలకు అప్లై చేయడానికి కస్టమర్లు 8010968334 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. లేదా SME అని టైప్ చేసి 7669300024 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో లోన్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. లేదా మీకు దగ్గర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో సంప్రదించొచ్చు.

  IRCTC Hyderabad Tour: రూ.3,845 ధరకే ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ... రామోజీ ఫిలిం సిటీ కూడా చూడొచ్చు

  ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పరిధిలోకి వచ్చే వ్యాపారల వివరాలు చూస్తే జిరాక్స్ సెంటర్స్, బ్యూటీ పార్లర్, ఆటో రిపేర్ సర్వీస్, గ్యారేజ్, టైలరింగ్, లాండ్రీ అండ్ డ్రైక్లీనింగ్, ఖాదీ ఉత్పత్తులు, పౌల్ట్రీ ఫారమ్, స్టేషనరీ స్టోర్స్ లాంటివి ఉంటాయి. ఈ వ్యాపారాలు చేయాలనుకునేవారు బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే బీఓఐ స్టార్ ఎంఎస్ఎంఈ వెల్‌కమ్ ఆఫర్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను పొందొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Bank loan, Bank loans, Bank of India, Business, BUSINESS NEWS, Personal Finance, Small business

  ఉత్తమ కథలు