Home /News /business /

BANK OF BARODA WITHDRAWS OFFERS FEATURES FOR CREDIT CARD HOLDERS FROM SEPTEMBER 15 SU GH

Credit Card: క్రెడిట్ కార్డు ఆఫర్లను ఉపసంహరించుకోనున్న ప్రముఖ బ్యాంక్.. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈజీ, స్వావలంబన్, సెలక్ట్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లకు బ్యాంకు షాక్ ఇచ్చింది. వీరికి అందిస్తున్న ఆఫర్లు, రివార్డులు ఇతర ప్రయోజనాలను తగ్గించాలని తాజాగా నిర్ణయించింది.

ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda). ఈజీ, స్వావలంబన్, సెలక్ట్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లకు బ్యాంకు షాక్ ఇచ్చింది. వీరికి అందిస్తున్న ఆఫర్లు, రివార్డులు ఇతర ప్రయోజనాలను తగ్గించాలని తాజాగా నిర్ణయించింది. ఈ నిర్ణయాలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆగస్టులో అప్లై చేసుకున్న కస్టమర్లకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులు(Credit Cards) ఇస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా గతంలో ప్రకటించింది. అయితే తరువాతి నెల నుంచి ఇందుకు ఛార్జీలు వర్తిస్తాయని తాజాగా వెల్లడించింది. క్రెడిట్ కార్డులపై ఇతర బ్యాంకులు ఎన్నో ఆఫర్లు అందిస్తున్న తరుణంలో.. బ్యాంకు తాజా నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

* కార్డ్ రీపేమెంట్ బకాయిలపై క్యాష్‌బ్యాక్ ఉండదు
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజీ, స్వావలంబన్ క్రెడిట్ కార్డుదారులకు.. క్రెడిట్ కార్డు రీపేమెంట్ బకాయిల చెల్లింపులపై 0.5 శాతం క్యాష్‌బ్యాక్‌ వచ్చేది. ఈ క్యాష్‌బ్యాక్ తదుపరి నెల స్టేట్‌మెంట్‌లో క్రెడిట్(Credit card Statement) అయ్యేది. అయితే సెప్టెంబర్ 15 నుంచి ఈ ఆఫర్‌ను రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది.

Swift Hatchback: సుజుకీ స్విఫ్ట్ కారు అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఆ టెస్టులో జీరో రేటింగ్.. వివరాలివే

* రివార్డు పాయింట్లలో కోత
క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ప్రతి లావాదేవీపై బ్యాంకులు రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. ఇలా కూడబెట్టుకునే రివార్డ్ పాయింట్లతో ఏదైనా వస్తువును కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను(Credit Card Dues) చెల్లించే సందర్భంలోనూ వీటిని వాడుకోవచ్చు. ప్రతి రివార్డ్ పాయింట్ రిడమ్షన్ విలువను బ్యాంక్ ఆఫ్ బరోడా 25 పైసలుగా నిర్దేశించింది. అయితే సెప్టెంబర్ 15 నుంచి ఈజీ, స్వావలంబన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రివార్డ్ పాయింట్ విలువ 20 పైసలుగా ఉంటుందని బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త రేటు అమల్లోకి రాకముందే కస్టమర్లు పాత రివార్డ్ పాయింట్లను(Reward Points) రిడీమ్ చేసుకొని ప్రయోజనాలు పొందవచ్చు.

NPS rules: నేషనల్ పెన్షన్ స్కీమ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్.. మరిన్ని ప్రయోజనాలే లక్ష్యంగా మార్పులు.. వివరాలివే

* బోనస్ రివార్డు ఉపసంహరణ
సెలక్ట్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ప్రస్తుతం నెలకు రూ.1,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే ఐదు లావాదేవీలపై 1000 బోనస్ రివార్డ్ పాయింట్లను పొందుతున్నారు. ఇది కస్టమర్ల సాధారణ రివార్డ్ పాయింట్లకు అదనంగా ఉంటుంది. కానీ బోనస్ రివార్డ్ పాయింట్లను(Bonus Reward Points) బ్యాంకు సెప్టెంబర్ 15 నుంచి ఉపసంహరించుకోనుంది.

* స్టేట్‌మెంట్ ప్రకారం చెల్లించాల్సిన మినిమం అమౌంట్ చెల్లించకపోతే.. బ్యాంక్ అన్ని క్రెడిట్ కార్డులపై ఆలస్య రుసుము వసూలు చేస్తుంది. ఈ లేట్ పేమెంట్ ఛార్జీలను సైతం బ్యాంకు పెంచింది. చెల్లించాల్సిన మొత్తాన్ని బట్టి పెరిగిన ఛార్జీ మారుతుందని ప్రకటించింది. క్రెడిట్ లిమిట్‌ను(Credit Limit) మించి క్రెడిట్ కార్డు వాడినప్పుడు చెల్లించాల్సిన ఛార్జీలను సైతం బ్యాంక్ ఆఫ్ బరోడా పెంచింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Bank of Baroda, Credit cards

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు