హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Of Baroda: గుడ్ న్యూస్.. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. కొత్త వడ్డీ రేట్లు ఇవే..

Bank Of Baroda: గుడ్ న్యూస్.. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. కొత్త వడ్డీ రేట్లు ఇవే..

Bank Of Baroda

Bank Of Baroda

Bank Of Baroda: బ్యాంక్‌ ఆఫ్ బరోడా (Bank Of Baroda) టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. ఆ ఎఫ్‌డీ రేట్లు సెప్టెంబరు 13, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

బ్యాంక్‌ (Bank) లో మనీ డిపాజిట్ (Money Deposit) చేయాలనుకుంటున్నారా.. అయితే మీకొక ఒక గుడ్ న్యూస్. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్ బరోడా (Bank Of Baroda) టర్మ్ డిపాజిట్ల (Term Deposits)పై వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంక్ రూ.2 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. ఆ ఎఫ్‌డీ రేట్లు సెప్టెంబరు 13, 2022 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త వడ్డీ రేట్లు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లకు వర్తిస్తాయి. ఆల్రెడీ ఈ బ్యాంకులో ఎఫ్‌డీ లేదా టర్మ్ డిపాజిట్లు చేసి ఉంటే నార్మల్ సిటిజన్లకు 20 బేసిస్ పాయింట్లు వరకు ఎక్కువ వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. మరి కొత్తగా పెరిగిన ధరల ప్రకారం, ఏయే కాల పరిమితుల టర్మ్ డిపాజిట్లకు ఎంత మేర వడ్డీ రేటు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* నార్మల్ సిటిజన్లకు డొమెస్టిక్, నాన్-రెసిడెంట్ ఆర్డినరీ టర్మ్ డిపాజిట్ కొత్త వడ్డీ రేట్లు

- ఒక సంవత్సరం కాలవ్యవధికి టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.30 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది.

- 400 రోజులు నుంచి 3 ఏళ్లకు పైబడిన డిపాజిట్ల వడ్డీ రేటు 5.45 శాతం నుంచి 5.50 శాతం పెరిగింది.

- 3 ఏళ్లు నుంచి 10 ఏళ్లు మధ్య కాలపరిమితికి 5.65 శాతం, 0.15 శాతం పెరిగింది.

* సీనియర్ సిటిజన్లకు రూ.2 కోట్ల టర్మ్ డిపాజిట్లపై కొత్త రేట్లు

కొత్త రేట్లు పాత 5.95-6.50 శాతం రేట్లతో పోలిస్తే 6-6.65 శాతం పరిధిలో పెరిగాయి.

- 1 ఏడాది కాలపరిమితికి సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ లభిస్తుంది.

- 1 ఏడాది నుంచి 400 రోజులకు 6.00 వడ్డీ రేటు అందుతుంది.

- 400 రోజుల నుంచి 2 ఏళ్ల వరకు 6.00 శాతం

- 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వరకు 6.05 శాతం

- 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు 6.30 శాతం

- 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు 6.65%

* బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్

ఈ బ్యాంక్ ఆఫర్ చేస్తున్న బరోడా తిరంగ డిపాజిట్ స్కీమ్ రెండు కాల పరిమితుల్లో టర్మ్ డిపాజిట్ అకౌంట్స్ ఆఫర్ చేస్తోంది. 444 రోజుల కాల పరిమితికి 5.75 శాతం వార్షిక వడ్డీ రేట్లను.. 555 రోజుల పరిమితికి 6 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ రేట్లు డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటాయి.

ఇది కూడా చదవండి : జులై 31కి ముందు ఐటీఆర్ ఫైల్ చేసినా ఇంకా ట్యాక్స్ రీఫండ్ రాలేదా? కారణాలు ఇవే..

* బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్స్

బ్యాంక్ ఆఫ్ బరోడా 5-10 ఏళ్ల కాలవ్యవధికి ‘బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్’పై వడ్డీని 0.15 శాతం పెంచగా ఇప్పుడది 5.65 శాతానికి పెరిగింది. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ విషయానికొస్తే.. రూ.15 లక్షలు రూ.2 కోట్ల కంటే తక్కువ డొమెస్టిక్, ఎన్‌ఆర్‌ఓ, నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (ఎన్‌ఆర్‌ఈ) వంటి సాధారణ అకౌంట్ హోల్డర్లకు ఒక ఏడాది కాలపరిమితి నుంచి ఆపై కాల పరిమితులకు 5.65 శాతం నుంచి 5.80 శాతానికి పెంచారు. బరోడా అడ్వాంటేజ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (డొమెస్టిక్) అకౌంట్స్ కింద సీనియర్ సిటిజన్లకు రూ.15.01 లక్షల - రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు 6.8% వరకు వడ్డీని అందిస్తోంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Bank of Baroda, Fixed deposits, Interest rates, Personal Finance

ఉత్తమ కథలు