BANK OF BARODA OFFERS HOME LOAN AT LOWEST INTEREST RATES AND NO PROCESSING FEE FOR THEIR CUSTOMERS PRV GH
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అతి తక్కువ వడ్డీకే హోమ్‌లోన్, నో ప్రాసెసింగ్ ఫీజు
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో పండుగ సీజన్ నడుస్తుండటంతో ప్రత్యేక పండుగ ఆఫర్లను ప్రకటించింది.
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తమ ఖాతాదారులకు (Account holders) గుడ్‌న్యూస్ చెప్పింది. దేశంలో పండుగ సీజన్ నడుస్తుండటంతో ప్రత్యేక పండుగ ఆఫర్ల (festival offer)ను ప్రకటించింది. సొంతిటి కల నిజం చేసుకోవాలనుకునే వారికి తక్కువ వడ్డీకే రుణాలు (loans) మంజూరు చేస్తామని తెలిపింది. అందుకు అనుగుణంగా హోమ్‌లోన్ (home loan) వడ్డీ రేట్లను 25 బిపిఎస్ పాయింట్ల మేర తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రస్తుతం ఉన్న 6.75% హోమ్‌లోన్ వడ్డీ రేటును 6.50 శాతానికి (Six and half percentage) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీరేటు (Interest rates) అక్టోబర్ 7 నుంచి వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రత్యేక వడ్డీ రేటు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
కొత్తగా తీసుకునే లోన్లు (loans), లోన్ ట్రాన్స్ఫర్లు లేదా లోన్ రీఫైనాన్స్ (loan Re finance)పై ఈ తాజా వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. హోమ్‌లోన్ వడ్డీ రేటు తగ్గింపుపై బ్యాంక్ ఆఫ్ బరోడా రిటైల్ విభాగం జనరల్ మేనేజర్ మిస్టర్ హెచ్‌టి సోలంకి మాట్లాడుతూ ‘‘ఈ పండుగ సీజన్లో రిటైల్ లోన్లపై ఆఫర్లను ప్రకటించడం సంతోషంగా ఉంది. వడ్డీ రేటు (Interest rate) తగ్గింపు ద్వారా మా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు చేకూర్చాలని నిర్ణయించాం. కేవలం 6.50 శాతానికే హోమ్‌లోన్‌తో పాటు ప్రాసెసింగ్ ఫీజు (processing fee) నుంచి మినహాయింపును ప్రకటించాం. మా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పుడూ ముందుంటాం” అని పేర్కొన్నారు.
* ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు..
కస్టమర్లు ఇంటి నుంచే లోన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చని బ్యాంకు (bank) ప్రకటించింది. ఖాతాదారులు (Account holders) బాబ్ వరల్డ్ యాప్ ద్వారా హోమ్ లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కేవలం హోమ్లోన్ల పైనే కాదు.. కార్ లోన్లపై కూడా వడ్డీ రేటును తగ్గించింది. కేవలం 7.00 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తామని తెలిపింది. కార్ లోన్‌ను కూడా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో అందజేస్తామని పేర్కొంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.