Stock Market | ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో (Banks) ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా అదరగొడుతోంది. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) షేరు దుమ్మురేపుతోంది. పరుగులు పెడుతూ దూసుకుపోతోంది. ఈ బ్యాంక్ షేరు ఇటీవలనే 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. డిసెంబర్ 2న ఈ బ్యాంక్ స్టాక్ రూ. 174 వద్ద ఉంది. గత నెల రోజుల్లో చూస్తే.. ఈ షేరు 18 శాతానికి పైగా ర్యాలీ చేసింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు రూ. 81.95 నుంచి రూ. 171 స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. అంటే ఇన్వెస్టర్లకు 108 శాతం మేర రాబడిని అందించింది. అంటే డబ్బులను రెట్టింపు చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ కన్నా బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు ఏకంగా 46 శాతం మేర ఎక్కువ ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే.. 62 శాతం మేర పైకి కదిలింది.
ఎలక్ట్రిక్ బైక్ అదిరింది.. రూ.2తో 150 కిలోమీటర్లు వెళ్లొచ్చు, ధర రూ.10 వేలు!
అద్భుతమైన పనితీరుతో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు ఇండెక్స్‌లో రెండో టాప్ గెయినర్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత స్థాయిలో చూస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడాషేరు తన 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 122 శాతం మేర పైకి చేరిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 77గా ఉంది. నవంబర్ 5 నుంచి ఈ షేరులో అప్‌ట్రెండ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ తన సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను వెల్లడించిన దగ్గరి నుంచి స్టాక్ జోరు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం .. ఇక ఎనీటైమ్ బంగారం, క్రెడిట్ కార్డుతో కూడా కొనొచ్చు!
బ్యాంక్ నికర లాభం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఐదు క్వార్టర్ల నుంచి ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ. 2,088 కోట్లుగా నమోదు అయ్యింది. రూ. 2 వేల కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 59 శాతం పెరిగింది. రూ. 3,313 కోట్లుగా నమోదు అయ్యింది. రూ. 3 వేల కోట్ల మార్క్ దాటడం ఇదే ప్రథమం. నికర వడ్డీ ఆదాయం పెరగడం, మొండి బకాయిలు తగ్గడం ఇందుకు కారణం.
ఆశికా స్టాక్ బ్రోకింగ్ కంపెనీ తన తాజా నివేదికలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరుపై బుల్లిష్‌గా ఉంది. ఎస్బీఐ మినహాయించి మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉత్తమమైన పనితీరు కనబరుస్తోందని వివరించింది. స్టాక్ ధర రూ. 197కు చేరొచ్చని అంచనా వేసింది. స్టాక్‌ను కొనొచ్చని సిఫార్సు చేసింది. ఇతర అనలిస్ట్‌లు కూడా ఈ షేరుపై సానుకూలముగానే ఉన్నారు. కాగా స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి. అందుకే డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of Baroda, Banks, Share Market Update, Stock Market, Stocks