హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఈ బ్యాంక్‌లో బంపరాఫర్లు.. మహిళలకు ప్రత్యేక తగ్గింపు!

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఈ బ్యాంక్‌లో బంపరాఫర్లు.. మహిళలకు ప్రత్యేక తగ్గింపు!

గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఈ బ్యాంక్‌లో బంపరాఫర్లు!

గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఈ బ్యాంక్‌లో బంపరాఫర్లు!

Gold Loan Interest Rates | బంగారం తనఖా పెట్టి రుణం తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మీకోసం పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Bank Gold Loan | ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? లేదంటే అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చిందా? తెలిసిన వారికి అడిగితే డబ్బులు (Money) లేవన్నారా? ఏం చేయాలో అర్థం కావడం లేదా? అందుకనే ఇంట్లో ఉన్న బంగారాన్ని (Gold) తనఖా పెట్టి రుణం (Loan) తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? బ్యాంక్ గోల్డ్ లోన్ తీసుకునే వారికి పలు రకాల బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

  ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) తాజాగా ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. వివిధ రకాల రుణాలపై ఆకర్షణీయమైన ప్రయోజనాలు అందిస్తోంది. వీటిల్లో గోల్డ్ లోన్స్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా బంగారంపై రుణం పొందే వారికి కూడా పలు బెనిఫిట్స్ అందిస్తోంది.

  ఎయిర్‌టెల్ కొత్త సర్వీసులు.. ఒకేసారి రూ.10 వేలు పొందొచ్చు!

  బ్యాంక్ ఆఫ్ బరోడా త్వరితగతిన కస్టమర్లకు బంగారు రుణాలు అందిస్తోంది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తోంది. అయితే ఒక లిమిట్ వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే రూ. 3 లక్షల వరకు గోల్డ్ లోన్స్‌కు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు నుంచి మాఫీ ఉంటుంది. ఈ పరిమితి దాటి లోన్ తీసుకుంటే అప్పుడు ప్రాసెసింగ్ చార్జీలు పడతాయి.

  కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేస్తే రూ.50 వేలు జరిమానా, ఏడాది జైలు శిక్ష

  అంతేకాకుండా వడ్డీ రేటుపై కూడా తగ్గింపు ప్రయోజనాలు అందిస్తోంది. మహిళలు గోల్డ్ లోన్స్ తీసుకుంటే వడ్డీ రేటులో తగ్గింపు లభిస్తుందని బ్యాంక్ పేర్కొంటోంది. 0.40 శాతం వరకు రాయితీ ఉంటుంది. బంగారంపై గరిష్టంగా రూ. 25 లక్షల వరకు రుణాలు పొందొచ్చు. అలాగే గోల్డ్ లోన్ తీసుకున్న వారు రుణాన్ని టెన్యూర్ కన్నా ముందే క్లోజ్ చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఎలాంటి ప్రిక్లోజర్ చార్జీలు ఉండవని బ్యాంక్ తెలియజేస్తోంది.

  బంగారంపై తీసుకున్న రుణాన్ని 36 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రేటు బీఆర్ఎల్ఎల్ఆర్, ఎస్‌పీ, 1 శాతం కలిసి ఉంటాయి. గోల్డ్ లోన్ తీసుకోవాలని భావించే వారు బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న ఈ ప్రయోజనాలను పొందొచ్చు. మీకు దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి నిమిషాల వ్యవధిలో బంగారంపై రుణం తీసుకోవచ్చు. ఇకపోతే ఇతర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీ ఉందో అక్కడే రుణం తీసుకోవడం ఉత్తమం. వడ్డీ రేటు తగ్గితే.. లోన్ ఈఎంఐ కూడా తగ్గుతుంది.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Bank of Baroda, Banks, Gold, Gold loans, Gold rate

  ఉత్తమ కథలు