హోమ్ /వార్తలు /బిజినెస్ /

BOB Mega e-Auction: బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఈ-వేలం.. తక్కువ ధరకే ఇళ్లు, ఆస్తులు కొనేయండిలా..

BOB Mega e-Auction: బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఈ-వేలం.. తక్కువ ధరకే ఇళ్లు, ఆస్తులు కొనేయండిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank Of Baroda) ఈ నెల 16న ఈ వేలం(E-Auction) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో పాల్గొని తక్కువ ధరకే ఆస్తులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

మీరు తక్కువ ధరలో ఇల్లు(House), ఫ్లాట్లు, ఆఫీస్ స్పేసెస్(Office Spaces), ల్యాండ్, ఇండస్ట్రియల్ ప్రాపర్టీలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆక్షన్(Bank Of Baroda E-Auction) ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఆక్షన్ లో పాల్గొని తక్కువ ధరకే పైన తెలిపిన ప్రాపర్టీలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. మెగా ఈ-వేలం(E-Auction) నవంబర్ 16, 2021న నిర్వహించబడుతుందని బ్యాంక్ ట్వీట్ చేసింది. ఇందులో నివాస, వాణిజ్య ఆస్తులను వేలం వేయనున్నారు. ఇక్కడ మీరు సరసమైన ధరకు ఆస్తిని కొనుగోలు చేయవచ్చని బ్యాంకు వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మెగా ఇ-యాక్షన్ పట్ల ఆసక్తి ఉన్నవారు https://ibapi.in/లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్టల్‌లో 'బిడ్డర్స్ రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేసిన తర్వాత, మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ ఐడీ నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

KYC పత్రాలు..

బిడ్డర్లు అవసరమైన KYC పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. KYC పత్రాలు ఈ-వేలం సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ధృవీకరించబడతాయి. దీనికి రెండు రోజులు పట్టవచ్చు. ఆస్తి వేలం గురించి మరింత సమాచారం కోసం మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.

Business Ideas: ఖర్చు లేని వ్యాపారం... కోట్లలో ఆదాయం... ఇలా ప్రారంభించండి

UPI Without Internet: ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్ చేయండి ఇలా..

బ్యాంకులు వేలం ఎందుకు నిర్వహిస్తాయంటే..

రుణంపై తీసుకున్న ఆస్తి విషయంలో, ఆస్తి యజమాని రుణ మొత్తాన్ని చెల్లించనప్పుడు, నోటీసు ఇవ్వడం ద్వారా అటువంటి ఆస్తిని అధికారికంగా జప్తు చేస్తుంది. తర్వాత అలాంటి ఆస్తులను వేలం వేస్తారు. ఆస్తులను వేలం వేయడం ద్వారా బ్యాంకు తన బకాయిలను రాబట్టుకుంటుంది. ఇలాంటి వేలంలో పాల్గొని తక్కువ ధరకే ఆస్తులను సొంతం చేసుకోవచ్చు.

First published:

Tags: Bank, Bank of Baroda, House loan, KYC submissionsn, Low cost house

ఉత్తమ కథలు