ఈ మధ్య బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజ్మెంట్... గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో ఉన్న తమ బ్రాంచుల్లో రహస్య తనిఖీలు జరిపింది. ఈ దాడుల్లో ఓ విషయం తెలిసింది. చాలా మంది బ్యాంక్ మగ ఉద్యోగులు... బ్రాంచిలను ఇష్టారాజ్యంగా వస్తున్నారు. చింపిరి జుట్టు, పొడవాటి మీసాలు, గుబురు గెడ్డాలు, టీ షర్టులు... ఇలా ఏమాత్రం నీట్ నెస్ మెయింటేన్ చెయ్యట్లేదని తేలింది. కొన్ని బ్రాంచుల్లోనైతే... టైముకి రావట్లేదట. కొంతమందైతే... స్లిప్పర్లతో ఆఫీస్‌కి వస్తున్నారట. ఉద్యోగులు ఇలా కనిపిస్తే, ఇక బ్రాంచిలను కస్టమర్లు ఎలా వస్తారు. క్లాస్‌గా కనిపించాలి కదా... అనుకున్న మేనేజ్మెంట్ కండీషన్స్ అప్లై అంటూ సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై భుజ్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా పురుష ఉద్యోగులు ఎక్కువ జుట్టు పెంచుకోకూడదు, మీసాలు ట్రిమ్మింగ్ చేయించుకోవాలి. గుబురు గెడ్డాలు (మత పరమైన అంశాల్లో మినహా) ఉండకూడదు. క్లీన్‌గా కనిపించే, ఐరన్ చేయించిన డ్రెస్సులు మాత్రమే వేసుకుంటూ... స్మార్ట్ లుక్‌లో కనిపించాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈమధ్యే విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌తో విలీనమైంది. ఈ క్రమంలో ఆ బ్యాంక్ ప్రమాణాలు పెంచుకుంటోంది. తమ సర్క్యులర్‌లో 11 కండీషన్లు పెట్టింది. మేల్ ఉద్యోగులు పొడవాటి జుట్టు పెంచుకోవాలనుకుంటే, అది చక్కటి ఆకృతిలో, చక్కగా దువ్వుకున్నట్లుగా ఉండాలని తెలిపింది. మీసాలు కూడా వీలైనంతవరకూ చిన్నగా ఉండాలని సూచించింది.
ఈ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం... మగ ఉద్యోగులు జీన్స్, టీ-షర్ట్స్ వేసుకొని ఆఫీస్‌కి రాకూడదు. ప్యాంట్స్, షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి. అవి కూడా చక్కగా టక్ చేసుకోవాలి. ముందువైపు ఎలాంటి మడతలూ ఉండకూడదు. ఇక మహిళా ఉద్యోగులు చీరలు, సల్వార్ సూట్స్ వేసుకోవాలని బ్యాంక్ సూచించింది. త్వరలో ఈ కండీషన్లు దేశవ్యాప్తంగా ఆ బ్యాంకుకి ఉన్న అన్ని బ్రాంచుల్లో అమలు చేసే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి :
హైకోర్టుకు చేరిన సీఎల్పీ విలీన వివాదం... నేడు విచారణ... చట్టం ఏం చెబుతుంది..?
మానవ జాతికే ప్రమాదం... మాంస భక్షక మొక్కలు...
అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే... ఇలా పాసైన స్టూడెంట్ ఇతనొక్కడేనేమో..?
చందమామలో భారీ వింత లోహం... ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of Baroda, BUSINESS NEWS, National News