news18-telugu
Updated: November 11, 2020, 3:16 PM IST
ప్రతీకాత్మకచిత్రం
ప్రభుత్వ రంగ Bank Of Baroda బుధవారం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్ఆర్) లో 0.05 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ మినహాయింపు అన్ని రకాల రుణాలపై MCLR తగ్గింపును అమలు చేయనుంది. ఎంసిఎల్ఆర్లో ఈ కోత 2020 నవంబర్ 12 గురువారం నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. Bank Of Baroda తన స్టాక్ మార్కెట్ రెగ్యులరేటరీ ఫైలింగ్ లో బ్యాంక్ నవంబర్ 12, 2020 నుండి వర్తించే MCLR రేటును సవరించింది. దీని కింద సవరించిన ఏడాది ఎంసిఎల్ఆర్ 7.5 శాతానికి బదులుగా 7.45 శాతంగా ఉంటుంది. MCLR అన్ని వినియోగదారుల రుణాలకు ప్రామాణికంగా పనిచేస్తుంది. ఇందులో వినియోగదారుల రుణాలతో పాటు ఆటో, రిటైల్, గృహ రుణాలు ఉన్నాయి. తాజా తగ్గింపు తర్వాత MCLR లింక్ హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గనున్నాయి. ఉదాహరణకు రూ.25 లక్షల లోన్ పైన 30 ఏళ్ల కాలపరిమితి ఉంటే రూ.300 వరకూ తగ్గుతుందని BOB తెలిపింది. MCLR వడ్డీ రేటు అంటే బ్యాంకు సొంత నిధుల ఖర్చుపై ఆధారపడి ఉంటుంది.
అంతేకాదు ఒక రోజు నుండి 6 నెలల వరకు ఉన్న రుణాల ఎంసిఎల్ఆర్ ఇప్పుడు 6.60-7.30 శాతానికి తగ్గిందని బ్యాంక్ తెలిపింది. అంతకుముందు Bank Of Baroda రెపో రేట్ లింక్డ్ లోన్ వడ్డీ రేటు (బిఆర్ఎల్ఎల్ఆర్) ను 7 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గించింది. బ్యాంకు ఈ కొత్త రేట్లు 2020 నవంబర్ 1 నుండి వర్తిస్తాయి. గృహ రుణ, తనఖా రుణం, కారు, విద్య రుణం, వ్యక్తిగత రుణం మొదలైన వినియోగదారులకు ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చనుంది.
పండుగ సీజన్‌కు కూడా తగ్గింపు
అంతకుముందు, పండుగ వాతావరణం దృష్ట్యా, బ్యాంక్ గృహ మరియు కారు రుణాలపై డిస్కౌంట్లను ఇచ్చింది. బిఆర్ఎల్ఎల్ఆర్ తగ్గింపు తరువాత, వడ్డీ గృహ రుణంపై 6.85 శాతం, కారు రుణంపై 7.10 శాతం, తనఖా రుణంపై 8.05 శాతం, విద్యా రుణం 6.85 శాతం వడ్డీతో ప్రారంభమవుతుంది.
Published by:
Krishna Adithya
First published:
November 11, 2020, 3:16 PM IST