BoB Home Loan | ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటై బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తాజాగా తీపికబురు అందించింది. రుణ గ్రహాతలకు ఊరట కలిగే ప్రకటన చేసింది. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఊరట కలిగించింది. హోమ్ లోన్స్‌పై (Home Loans) రుణ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లోన్ తీసుకొని కొత్తగా ఇల్లు కట్టుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగుతుంది. తక్కువ వడ్డీకే లోన్ పొందొచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింది. ఈ తగ్గింపు నిర్ణయం నవంబర్ 14 నుంచి అమలులోకి వస్తుంది. బ్యాంక్ హోమ్ లోన్ రేటు తగ్గింపుతో ఇప్పుడు వడ్డీ రేటు 8.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ ఆఫర్ 2022 డిసెంబర్ 31 వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి.
షాకిస్తున్న బంగారం.. నెల రోజుల గరిష్టానికి ధర.. ఈరోజు రేట్లు ఇలా
అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి హోమ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు. 100 శాతం మాఫీ పొందొచ్చు. ఇప్పటికే వేరే బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకొని ఉంటే దాన్ని కూడా బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. లేదంటే తొలిసారి కొత్తగా హోమ్ లోన్ పొందొచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లేదా కొత్త హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. అయితే క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన వడ్డీ రేటులో మార్పు ఉండొచ్చు.
ఒక్కసారి చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు వెళ్లే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
బ్యాంక్ ఆఫ్ బరోడాలో తక్కువ వడ్డీకే హోమ్ లోన్ తీసుకోవడంతో పాటుగా జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది. ఇంకా తక్కువ డాక్యుమెంటేషన్‌తో లోన్ పొందొచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ టెన్యూర్ ఉంటుంది. 360 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. ప్రిపేమెంట్ చార్జీలు ఉండవు. పార్ట్ పేమెంట్ చార్జీలు కూడా చెల్లించాల్సిన పని లేదు. డోర్ స్టెప్ సర్వీస్ కూడా పొందొచ్చు. డిజిటల్ హోమ్ లోన్స్ కూడా పొందొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచులకు వెళ్లి హోమ్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో బ్యాంక్ వెబ్సైట్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేయొచ్చు. 21 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు వయసు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. రూ.7.5 కోట్ల వరకు లోన్ పొందొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాలు ప్రాతిపదికన లోన్ అమౌంట్లో మార్పు ఉండొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of Baroda, Banks, Bob, Home loan