Home /News /business /

BANK OF BARODA CUSTOMERS YOUR HOME LOAN CAR LOAN EMIS WILL INCREASE SOON UMG GH

Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు షాక్.. పెరిగిన లోన్ ఈఎంఐలు.. వివరాలివే..!

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. జులై 4, అంటే సోమవారం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచేసింది. ఈ బ్యాంక్ వివిధ టెన్యూర్లపై MCLR రేట్లను 10-15 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఇంకా చదవండి ...
ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. జులై 4, అంటే సోమవారం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచేసింది. ఈ బ్యాంక్ వివిధ టెన్యూర్లపై MCLR రేట్లను 10-15 బేసిస్ పాయింట్లు పెంచింది. పెరిగిన రేట్లు జులై 12, 2022 అమలులోకి వచ్చాయి. ఈ రేట్లు పెరగడం వల్ల బ్యాంకులో లోన్ తీసుకున్న వారు, ముఖ్యంగా హోమ్ లోన్స్, కారు లోన్స్, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారిపై ప్రభావం పడుతుంది. ఈ రుణగ్రహీతలు ఈఎంఐ (EMI)లు పెరుగుతాయి. కొత్తగా లోన్ తీసుకునే వారిపై కూడా పెరిగిన రేట్లు భారంగా మారతాయి.

అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంసీఎల్ఆర్ (MCLR) రేట్లు ఓవర్‌నైట్, ఒక నెల వ్యవధి గల రుణాలకు యథాతథంగా ఉంటాయని బ్యాంకు తెలిపింది. మూడు నెలల కాలవ్యవధికి మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా MCLR రేట్లు 7.35 శాతానికి పెంచింది. అంటే మునుపటి 7.25 శాతం నుంచి 10 బేసిస్ పాయింట్ల పెరిగింది. ఆరు నెలల కాలవ్యవధికి కూడా MCLR రేట్లు 10 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. దాంతో 6 నెలల వ్యవధి గల రుణాలకు MCLR రేట్లు 7.45 శాతానికి పెరిగాయి. ఇంతకుముందు 7.35 శాతంగా రేట్లు ఉండేవి. ఒక ఏడాది వ్యవధి గల వాహన, గృహ, వ్యక్తిగత రుణాల వంటి వినియోగదారుల రుణాలకు బెంచ్‌మార్క్‌ను ప్రస్తుతమున్న 7.50 శాతం నుంచి 7.65 శాతానికి పెంచింది. అంటే 15 బేసిస్ పాయింట్ల పెంచింది.



* జులై 12 నుంచి అమల్లోకి వచ్చే ఎంసీఎల్ఆర్ రేట్లు

- ఓవర్‌నైట్ MCLR రేట్
ఇప్పటికే ఉన్న రేటు ..6.80 శాతం; కొత్త రేటు .. 6.80 శాతం

- ఒక నెల MCLR రేట్
ప్రస్తుత రేటు ..7.20 శాతం; కొత్త రేటు - 7.20 శాతం

- మూడు నెలల MCLR రేట్
ప్రస్తుత రేటు ..7.25 శాతం; కొత్త రేటు - 7.35 శాతం

- ఆరు నెలల MCLR రేట్
ప్రస్తుత రేటు ..7.35 శాతం; కొత్త రేటు 7.45 శాతం

- ఒక సంవత్సరం MCLR రేట్
ప్రస్తుత రేటు 7.50 శాతం; కొత్త రేటు 7.65 శాతం

బ్యాంక్ ఆఫ్ బరోడా తన వెబ్‌సైట్‌లో జూలై 1 నుంచి తన బేస్ రేటు ఏడాదికి 8.15 శాతంగా ఉందని.. ప్రస్తుతం ఉన్న అన్ని ఖాతాలకు బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR) సంవత్సరానికి 12.45 శాతంగా ఉందని తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: Bank loans, Bank of Baroda, EMI, Interest rates

తదుపరి వార్తలు