హోమ్ /వార్తలు /బిజినెస్ /

EMI: బ్యాంక్ స్మార్ట్ ఈఎంఐ ఆఫర్.. కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్!

EMI: బ్యాంక్ స్మార్ట్ ఈఎంఐ ఆఫర్.. కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్!

EMI: బ్యాంక్ స్మార్ట్ ఈఎంఐ ఆఫర్.. కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్!

EMI: బ్యాంక్ స్మార్ట్ ఈఎంఐ ఆఫర్.. కస్టమర్లకు అదిరిపోయే బెనిఫిట్!

No Cost EMI | ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తాాజాగా అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. నో కాస్ట్ ఈఎంఐ ఆఫ్ ప్రకటించింది. ఇందులో భాగంగా పలు బెనిఫిట్స్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Bank | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై (Credit Card) నో కాస్ట్ ఈఎంఐ (EMI) ఆప్షన్ అందుబాటులో ఉంచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ తాజాగా స్పెషల్ ట్రావెల్ ఆఫర్లు ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని క్రెడిట్ కార్డులను ఈ ఆఫర్లు వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు కస్టమర్లు వారి క్రెడిట్ కార్డులపై మూడు నెలలు, ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చని తెలిపింది.

యాత్ర, ఎంఎంటీ, క్లియర్ ట్రిప్, ఈఎంటీ వంటి తదితర ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు కస్టమర్లు ఈ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. హాలిడే, వెడ్డింగ్ సీజన్‌లో ట్రావెల్, హాస్పిటాలిటీ ఖర్చులు పెరుగుతున్నాయని, అందువల్ల కస్టమర్ల కోసం ఈ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ తీసుకువచ్చామని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. అందువల్ల కస్టమర్లు ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఎండీ, సీఈవో శైలేంద్ర సింగ్ తెలిపారు.

రూ.24,999కే కొత్త ఇ-బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 40 కి.మి. వెళ్లొచ్చు

బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు కస్టమర్లు అందరూ ట్రాన్సాక్షన్లపై రివార్డులు పొందొచ్చని, డబ్బు ఆదా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అలాగే తర్వాత స్మార్ట్ ఈఎంఐ బెనిఫిట్ కింద డబ్బులు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. స్మార్ట్ ఈఎంఐ ఆఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని క్రెడిట్ కార్డులకు వర్తిస్తుంది. ఇందులో భాగంగా ట్రావెల్, డైనింగ్, ఇంటర్నేషనల్ స్పెండ్స్‌పై రూ.100పై 15 వరకు రివార్డు పాయింట్లు పొందొచ్చు. కార్డు ప్రాతిపదికన వచ్చే రివార్డు పాయింట్లు మారతాయి.

శుభవార్త.. వెండి ఢమాల్, రూ.3,700 పతనమైన ధర.. లేటెస్ట్ బంగారం రేట్లు ఇలా!

ఇంకా కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. మీ క్రెడిట్ కార్డు వేరియంట్ ప్రాతిపదికన ఈ బెనిఫిట్ మారుతుంది. కొన్ని కార్డులపై అపరిమిత లాంగ్ యాక్సెస్ ఉంది. అలాగే కొన్ని కార్డులపై 4 సార్లు మాత్రమే యాక్సెస్ లభిస్తుంది. అలాగే ఫ్యూయెల్ ఖర్చుపై కూడా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. హెచ్‌పీసీఎల్ బీఓబీ కార్డుపై ఈ ఆఫర్ ఉంది. 5 శాతం వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డుపై 4 సార్లు కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది. ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన పూర్తి అనుబంధ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.

First published:

Tags: Bank of Baroda, Banks, Credit cards, EMI

ఉత్తమ కథలు