హోమ్ /వార్తలు /బిజినెస్ /

BOB Mega e-Auction: ఇళ్లు, ఆస్తులను కొనాలనుకుంటున్నారా? అయితే.. తక్కువ ధరకే ఇలా కొనేయండి

BOB Mega e-Auction: ఇళ్లు, ఆస్తులను కొనాలనుకుంటున్నారా? అయితే.. తక్కువ ధరకే ఇలా కొనేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) మెగా ఈ వేలానికి (e-Auction) సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ వేలంలో పాల్గొని తక్కువ ధరకే ప్రాపర్టీలను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా.

  ఈ రోజుల్లో సొంతంగా ప్రాపర్టీలు ఉండాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. పెద్ద పెద్ద ఉద్యోగులే కాకుండా.. మామూలు ఆదాయం వచ్చే ఉద్యోగులు సైతం సొంతంగా ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. లోన్ తీసుకుని తమ కలను నెరవేర్చుకుంటున్నారు. మీకు కూడా అలాంటి ఆలోచనే ఉంటే... మీకో శుభవార్త.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) మెగా ఈ వేలానికి (e-Auction) సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ వేలంలో పాల్గొని తక్కువ ధరకే ప్రాపర్టీలను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. మీరు కూడా ఇందులో పాల్గొని మీ బడ్జెట్ ఆధారంగా ప్రాపర్టీలను కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్వహించనున్న ఈ ఈ వేలంలో రిజర్వ్ ప్రైస్ రూ.5.4 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్ట ధర రూ.1.5 కోట్లుగా ఉంది.

  అయితే మీరు ఈ వేలంలో పాల్గొనడానికి ముందే ఎక్కడెక్కడ ఏఏ ప్రాపర్టీలు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ ప్రాంతంలో మార్కెట్ రేటు ఎంత ఉందో కూడా తెలుసుకుంటే కొనాలా? వద్దా? అన్న అంశంపై అవగాహన ఏర్పడుతుంది. ఇంకా వేలంలో పాల్గొనే వారికి లోన్ సదుపాయం కూడా అందిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. దీంతో మీకు సరిపడా డబ్బులు లేకున్నా లోన్ తీసుకుని ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు.

  ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  Business Idea: పెట్టుబడే లేని బిజినెస్.. నెలకు రూ.50 వేలకు పైగా ఇన్‌కమ్.. ఓ లుక్కేయండి

  అయితే.. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోయిన వారి ప్రాపర్టీలను బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది. అలాంటి ప్రాపర్టీలను వేలం ద్వారా విక్రయించి నగదును సమీకరించుకుంటాయి బ్యాంకులు. అయితే.. ఇలాంటి వేలంలో పాల్గొని ప్రాపర్టీలను కొనుగోలు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. వెంటనే ఆ ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bank of Baroda, House loan

  ఉత్తమ కథలు